logo

మోదీతోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌

దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 03:07 IST

రాజ్‌నాథ్‌సింగ్‌కు స్వాగతం పలుకుతున్న లక్ష్మణ్‌

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌, న్యూస్‌టుడే, కంటోన్మెంట్‌: దేశాభివృద్ధి భాజపాతోనే సాధ్యమని, భాజపా హయాంలో త్రివిధ దళాల ఉన్నతాధికారులు తక్షణ నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ లభించిందని మల్కాజిగిరి భాజపా లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. గురువారం ఇంపీరియల్‌ గార్డెన్స్‌లో రాష్ట్ర త్రివిధ దళాల మాజీ సైనికోద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈటల  ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రపంచంలో 11వ స్థానంలో ఉండే దేశ ఆర్థిక వ్యవస్థ 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడానికి మోదీ నిర్ణయాలే కారణమన్నారు. భారాసకు ఓటెయ్యడం వల్ల ప్రజల సమస్యకు పరిష్కారం లభించదన్నారు. కాంగ్రెస్‌కి 300 సీట్లు వచ్చే అవకాశం లేదన్నారు. రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు, కంటోన్మెంట్‌ భాజపా ఎమ్మెల్యే అభ్యర్థి వంశతిలక్‌, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, కంటోన్మెంట్‌ బోర్డు నామినేటెడ్‌ సభ్యుడు రామకృష్ణ, రిటైర్డ్‌ వింగ్‌ కమాండర్‌ టీజే రెడ్డి,  హనుమాన్‌ చౌదరి, తెలంగాణ మాజీ సైనిక సంఘాల సమాఖ్య ప్రతినిధులు శ్రీనివాస్‌, లింగాల జగత్‌రెడ్డి, మాజీ సైనికోద్యోగులు,వారి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. వర్షం కారణంగా.. పార్టీ ప్రచారంలో పాల్గొనేందుకు నగరానికి వచ్చిన రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు గురువారం బేగంపేట విమానాశ్రయంలో పార్టీ నేతలు కె.లక్ష్మణ్‌, రామచంద్రరావు,కె.వెంకటేశ్వర్లు స్వాగతం పలికారు. మాజీ సైనికోద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొనాల్సి ఉండగా సాయంత్రం వర్షం పడడంతో పాల్గొన లేదు. 

మల్కాజిగిరి భాజపా లోక్‌సభ అభ్యర్థి ఈటల రాజేందర్‌, కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే అభ్యర్థి వంశ తిలక్‌కు సంఘీభావం తెలుపుతున్న రిటైర్డ్‌ మేజర్‌ జనరల్‌ శ్రీనివాసరావు, మాజీ సైనికోద్యోగులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని