logo

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో హైదరాబాద్‌కు ముప్పు: ఒవైసీ

భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్‌ హైదరాబాద్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు.

Published : 19 Apr 2024 03:10 IST

అసదుద్దీన్‌ ఒవైసీని, ఎమ్మెల్యే కౌసర్‌ను దీవిస్తున్న వృద్ధురాలు

గోల్కొండ, న్యూస్‌టుడే: భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లతో నగరానికి ముప్పు ఉందని ఎంపీ, మజ్లిస్‌ హైదరాబాద్‌ అభ్యర్థి అసదుద్దీన్‌ ఒవైసీ అన్నారు. గురువారం సాయంత్రం ఎన్నికల ప్రచారంలో భాగంగా టోలిచౌకి బాల్‌రెడ్డినగర్‌లో పాదయాత్ర నిర్వహించి మీడియాతో మాట్లాడారు. భాజపా నాయకులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నా ఎన్నికల కమిషన్‌, పోలీసు అధికారులు మిన్నకుంటున్నారని, చర్యలు తీసుకోవడం లేదన్నారు. తాను ఏదైనా మాట్లాడి ఉంటే దాన్ని సుమోటోగా స్వీకరించేవారన్నారు. ముస్లిం మహిళలు హిజాబ్‌ తీసేయాలని, తనను టెర్రరిస్టు అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతోపాటు హైదరాబాద్‌ బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారన్నారు. రాష్ట్రంలో గొడవలు లేకపోవడంతో పెట్టుబడులతో తెలంగాణ ఎక్కువ మూలధన ఆదాయం(క్యాపిటా ఇన్‌కమ్‌) కలిగి ఉందన్నారు. వికసిత్‌ భారత్‌.. సబ్‌కా సాథ్‌.. సబ్‌కా వికాస్‌ అంటే ప్రజలను రెచ్చగొట్టడం, శాంతికి విఘాతం కలిగించడమా అని ప్రశ్నించారు. తమిళనాడులో ఏఐడీఎంకేకు భాజపాతో పొత్తు లేదని, భవిష్యత్తులో కూడా ఉండదని అక్కడి నాయకులు తెలిపారన్నారు. ప్రజలు భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ల ఆగడాలు గమనిస్తున్నారన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని