రయమంటూ దూసుకెళ్తూ.. దడ పుట్టిస్తూ
సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది.
పగలు రోడ్లు.. రాత్రిళ్లు రేస్ ట్రాకులు
రేసింగ్, మందుబాబుల డ్రైవింగ్‌తో ప్రమాదాలు
నగరంలో పెరుగుతున్న హిట్ అండ్ రన్ కేసులు
ఈనాడు- హైదరాబాద్: సాయంత్రం దాటితే చాలు.. రేస్ ట్రాకుల్లా మారుతున్న నగర రోడ్లపై ప్రయాణం వెన్నులో వణుకుపుట్టిస్తోంది. ఖరీదైన కార్లు, బైకులతో దూసుకెళ్లడం.. ఒళ్లు తెలియనంతలా తప్పతాగి బండి నడపడం వెరసి ఎప్పుడు ఏవైపు నుంచి ఏ వాహనం ఢీకొడుతుందో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా మందుబాబుల డ్రైవింగ్ వాహనదారులు, పాదచారుల ప్రాణాల మీదకొస్తోంది. పోలీసులు డ్రంకెన్ డ్రైవ్‌లతో నిలువరిస్తున్నా కొందరు మాత్రం అడ్డదారుల్లో రహదారుల మీదకు దూసుకొస్తున్నారు. ఇటీవల రాయదుర్గం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఐటీ ఉద్యోగి రహదారిపై బీభత్సం సృష్టించారు. గంట వ్యవధిలో ఆరు రోడ్డు ప్రమాదాలు చేశాడు. ఇలాంటి ఘటనలు తరచూ వెలుగుచూస్తున్నా నియంత్రించడం సాధ్యపడడం లేదు.
వారాంతాల్లో అమ్మో.. ఖాళీ రోడ్లపై ఆకతాయిలు, పోకిరీలు స్టంట్లుచేస్తూ ప్రమాదాలకు కారణమవుతుంటే.. వారాంతాల్లో మరింత దారుణ పరిస్థితులు ఎదురవుతున్నాయి. సామాజిక మాధ్యమాల్లో లైకుల కోసం రేసింగ్‌లు, వేగంగా దూసుకెళ్తూ అవతలి వ్యక్తుల్ని ప్రమాదంలోకి నెట్టేస్తున్నారు. శని, ఆదివారాల్లో ఐటీ కారిడార్, నగరంలోని ఖాళీ రోడ్లపై ఈ తరహా పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖరీదైన కార్లు, ద్విచక్రవాహనాలపై రేసింగ్‌లు నిర్వహిస్తున్నారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాకే పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. నిందితుల్ని పట్టుకున్నా.. నిర్లక్ష్యపు డ్రైవింగ్ కింద కేసు నమోదుకే పరిమితమవుతున్నారు.
డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలున్నా..
పోలీసులు వారాంతాల్లో తప్పనిసరిగా, మిగిలిన రోజుల్లో హఠాత్తుగా డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఇవీ నిర్ణీత సమయం వరకే ఉండటంతో తరువాత మందుబాబులు చెలరేగుతున్నారు. అర్ధరాత్రి తర్వాత రోడ్డు ప్రమాదాలకు ఇదీ ఓ కారణం. కొందరు వాట్సాప్ గ్రూపులు ఏర్పాటుచేసి ఎక్కడెక్కడ తనిఖీలున్నాయో సమాచారం ఇచ్చుకుంటున్నారని చెబుతున్నారు.
పబ్బుల దగ్గర లేని నియంత్రణ..
పబ్బులు, బార్లలో ఎవరైనా మద్యం అతిగా సేవిస్తే వారు వాహనాలు డ్రైవింగ్ చేయకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రత్యామ్నాయ డ్రైవరు వచ్చేదాకా వారిని నిలువరించడం లేదా క్యాబ్‌లో పంపాలి. ఇటీవల కొత్తఏడాది వేడుకల సందర్భంగానూ పోలీసులు పబ్బులు, బార్ల నిర్వాహకులకు ఇదే విషయాన్ని స్పష్టం చేశారు. ఇదెక్కడా అమలవ్వడం లేదు. రాయదుర్గం రోడ్డు ప్రమాదంలో ఇదే పరిస్థితి. నిందితుడు ఆరు ప్రమాదాలకు కారణమైన యువకుడు సాయంత్రం తర్వాత ఓ పబ్బులో తాగాడు. పూర్తిగా నియంత్రణ కోల్పోయిన స్థితిలో డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు చేశాడు.
దుర్గం చెరువుపై వింత పరిస్థితి
దుర్గం చెరువు తీగల వంతెనపై వాహనదారుల తీరుతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. వీటిని నియంత్రించే విధుల్లో ఉంచిన ట్రాఫిక్ పోలీసులకు వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. విధుల్లో ఉండే ఇద్దరు కానిస్టేబుళ్లకు బ్రిడ్జి పొడవునా ఫొటోలు దిగే సందర్శకుల్ని నియంత్రించడం సాధ్యపడటం లేదు. ముఖ్యంగా మహిళలు వారించినా వినకుండా అసౌకర్యం కల్పిస్తున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇటీవల బ్రిడ్జిపై హిట్ రండ్ అన్ కేసు నేపథ్యంలో మాదాపూర్ పోలీసులు కవాతు నిర్వహిస్తూ అవగాహన కల్పించినా పరిస్థితిలో మార్పురావడం లేదు. అడపాదడపా రోడ్డు మీద వాహనాలు నిలిపి సెల్ఫీలు తీసుకుంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మ్యాన్‌హోల్ నుంచి వంటనూనెల వ్యర్థాలు
[ 27-07-2024]
ఆర్టీసీ క్రాస్‌రోడ్డు పరిధిలోని ప్రధాన రహదారిపై ఓ డ్రైనేజీ మ్యాన్‌హోల్ నుంచి శుక్రవారం ఉదయం వంటనూనెల వ్యర్థాలు పొంగిపొర్లాయి. -
రైలుబండి.. దొంగలున్నారు జాగ్రత్తండీ
[ 27-07-2024]
రైల్లో దూర ప్రయాణం.. రాత్రిళ్లు చల్లగాలి.. కబుర్లు చెప్పుకుంటూ నిద్రలోకి జారుకుంటే చాలు.. అదును కోసం చూస్తున్న దొంగలకు పండగే. -
మంచి దొంగ!.. చోరీకొచ్చి.. నీళ్లు తాగి.. డబ్బులు పెట్టి
[ 27-07-2024]
మహేశ్వరంలోని ఓ హోటల్లో చోరీ చేసేందుకు వచ్చిన ఓ దొంగ.. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరక్కుండా.. ఎంతో జాగ్రత్తగా పథకం వేశాడు. -
పనులు కదలాలి.. ప్రగతి పరుగిడాలి
[ 27-07-2024]
ఎనిమిదేళ్ల కిందట రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంటుగా హైదరాబాద్ మహానగరపాలక సంస్థ (జీహెచ్ఎంసీ)కు అందిన మొత్తం కేవలం రూ.250 కోట్లు. అప్పటి నుంచి బల్దియాకు ఒక్కపైసా కూడా గ్రాంటుగా నిధులందలేదు. -
అతివేగం తీసింది ఇద్దరి ప్రాణం.. సాఫ్ట్వేర్ ఉద్యోగుల దుర్మరణం
[ 27-07-2024]
రాజీవ్ రహదారిపై అతివేగంగా కారు నడిపి బస్సును ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు మృతి చెందారు. -
ఆ భూముల జాడ.. దేవుడికే తెలియాలి
[ 27-07-2024]
రాజధాని పరిధిలో 9వేల ఎకరాలకుపైనే దేవాదాయశాఖ భూములున్నాయి. నిత్యం ధూప, దీప నైవేద్యాల కోసం గతంలో అనేక మంది భూవిరాళాలు ఇచ్చారు. -
పాలక మండలి సభ్యుల సంబరాలు
[ 27-07-2024]
నగరం అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వేర్వేరు శాఖలకు కలిపి పద్దులో రూ.10వేల కోట్లను కేటాయించడంపై కాంగ్రెస్‌కు చెందిన జీహెచ్ఎంసీ పాలకమండలి సభ్యులు శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. -
మా ఇష్టం.. మేమిట్లే జేస్తం
[ 27-07-2024]
రాజధాని నగరంలో బహుళ అంతస్తుల భవన నిర్మాణాలు వేగంగా పెరుగుతుండడంతో వాటికి అవసరమైన ఇటుకల తయారీ కోసం కొందరు నీళ్లు సమృద్ధిగా ఉన్న జంటజలాశయాల పరివాహక ప్రాంతాన్ని ఎంచుకున్నారు. -
కుటుంబాలను కూల్చేస్తున్న రీల్స్
[ 27-07-2024]
రీల్స్ మోజులో పడి తల్లిదండ్రులకు కన్నీళ్లు మిగిల్చినవారు కొందరైతే.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకున్నవారు మరికొందరు. -
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘ఫ్రెండ్షిప్ వీక్’
[ 27-07-2024]
ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్‌సిటీ వేదికగా ఈనెల 28 నుంచి ఆగస్టు 4 వరకు కాలేజ్ స్పెషల్ ‘ఫ్రెండ్షిప్ వీక్’ వేడుకలు నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. -
యువతలో పెరుగుతున్న హృద్రోగ ముప్పు
[ 27-07-2024]
యువతలో గుండె సమస్యలు పెరుగుతున్నాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. -
విద్యుత్తు అధికారుల్లో సూర్యాఘర్ జోష్
[ 27-07-2024]
సౌర విద్యుత్తును 300 యూనిట్ల వరకూ పొందే ‘పీఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజిలీ యోజన’ పథకంలో ఎక్కువ మందిని చేర్పించే విద్యుత్తు అధికారులకు కేంద్రం ప్రోత్సహకాలు ప్రకటించింది. -
మాజీ రాష్ట్రపతి సమతామూర్తి స్ఫూర్తి కేంద్రం సందర్శన
[ 27-07-2024]
శంషాబాద్ మండలం శ్రీరామనగరంలో వెలిసిన సమతామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శుక్రవారం సందర్శించారు. -
దేశభక్తి చాటిన కార్గిల్ విజయోత్సవ ర్యాలీ
[ 27-07-2024]
కార్గిల్ యుద్ధ విజయోత్సవానికి పాతికేళ్ల సందర్భంగా శుక్రవారం నారాయణగూడలోని రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి(అర్బీవీఆర్ఆర్) మహిళా కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్-2, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ స్వచ్ఛంద సంస్థల సంయుక్తాధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ పలు ప్రాంతాల్లో కొనసాగింది. -
కోట్‌పల్లి కల్పవల్లి
[ 27-07-2024]
జిల్లాలో అతిపెద్దదైన కోట్‌పల్లి ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇచ్చింది. బడ్జెట్లో రూ.8 కోట్లు కేటాయించింది. -
అరణ్యం కబ్జా పర్వం.. కొనసాగుతున్న వివాదం!
[ 27-07-2024]
రెండు దశాబ్దాలుగా జిల్లాకు చెందిన అటవీ భూములను ఆక్రమించుకుని కర్ణాటక వాసులు సాగు చేస్తూ పంటలు పండిస్తున్నారు. -
బాధిత అంధ బాలికను, కుటుంబాన్ని ఆదుకోవాలి
[ 27-07-2024]
మలక్‌పేట ప్రభుత్వ అంధ బాలికల వసతి గృహం వద్ద శుక్రవారం ఆందోళనలు కొనసాగాయి. -
రాష్ట్రపతి నిలయాల్లో సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం
[ 27-07-2024]
ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతిగా రెండేళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం, సిమ్లా, దిల్లీలోని రాష్ట్రపతి భవనాల సందర్శనకు సాయుధ దళాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నట్లు రాష్ట్రపతి నిలయం అధికారులు తెలిపారు. -
శిల్పారామం పేరు, లోగో వాడొద్దు
[ 27-07-2024]
అనుమతి లేకుండా శిల్పారామం పేరు, లోగోను ఇతరులు ఉపయోగించరాదని శిల్పారామం ప్రత్యేకాధికారి జి.కిషన్‌రావు ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. -
ఆలయాల్లో కానుకలు చోరీ!
[ 27-07-2024]
దేవాలయాలు లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్న టి.నరేందర్(27)ను శుక్రవారం అరెస్ట్ చేసినట్టు ఫలక్‌నుమా ఏసీపీ ఎన్.ఎల్.నారాయణరాజు తెలిపారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు రూపాయి తీసుకు రాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం
-
ఆగస్టు 23న.. ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ..!
-
భద్రాచలం వద్ద మళ్లీ పెరుగుతున్న గోదావరి నీటి మట్టం
-
రివ్యూ: బ్లడీ ఇష్క్: అవికా గోర్ సినిమా థ్రిల్ చేసిందా?