logo

కట్టడాలను పరిరక్షించి భావి తరాలకు అందిద్దాం

బన్సీలాల్‌పేటలోని పురాతన మెట్లబావి ప్రాంగణంలో శనివారం ద ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ ఆన్‌ సైట్స్‌, డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ఆధ్వర్యంలో ద వాయిస్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ బాడ్జ్‌  కార్యక్రమాన్ని నిర్వహించారు.

Published : 21 Apr 2024 02:49 IST

బన్సీలాల్‌పేట మెట్ల బావి వద్ద డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ బృందం

పద్మారావునగర్‌, న్యూస్‌టుడే: బన్సీలాల్‌పేటలోని పురాతన మెట్లబావి ప్రాంగణంలో శనివారం ద ఇంటర్నేషనల్‌ కౌన్సిల్‌ ఆన్‌ మాన్యుమెంట్స్‌ ఆన్‌ సైట్స్‌, డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ఆధ్వర్యంలో ద వాయిస్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ బాడ్జ్‌  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐకోమస్‌ దక్షిణ ప్రాంత ప్రతినిధి ప్రొఫెసర్‌ సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ చారిత్రాత్మక, పురాతన కట్టడాలను పరిరక్షిస్తూ, భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని గుర్తుచేశారు. జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ కళాశాల, శ్రీవేంకటేశ్వర కాలేజ్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌, జేబీఆర్‌ ఆర్కిటెక్చర్‌ కళాశాల విద్యార్థులకు పురాతన మెట్లబావి చరిత్ర, పునరుద్ధరణ వివరాలను తెలియజేశారు. డెక్కన్‌ హెరిటేజ్‌ అకాడమీ ట్రస్ట్‌ చైర్మన్‌ ఎం.వేదకుమార్‌, కన్జర్వేటివ్‌ ఆర్కిటెక్ట్‌లు డాక్టర్‌ వసంత శోభ, ఇందిర హాజరయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని