logo

కాంగ్రెస్‌తోనే సంక్షేమం

భారాస ఖాళీ అవుతోందని, ఆ పార్టీ నుంచి సంక్షేమం కోరుతూ వస్తున్న కార్యకర్తలు, నాయకులను తాము కుటుంబ సభ్యులుగా గుర్తింపు ఇస్తామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 22 Apr 2024 03:26 IST

పార్టీలోకి ఆహ్వానిస్తున్న రామ్మోహన్‌రెడ్డి

పరిగి, న్యూస్‌టుడే: భారాస ఖాళీ అవుతోందని, ఆ పార్టీ నుంచి సంక్షేమం కోరుతూ వస్తున్న కార్యకర్తలు, నాయకులను తాము కుటుంబ సభ్యులుగా గుర్తింపు ఇస్తామని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి.రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెస్‌తోనే సాధ్యమని పార్టీలో చేరుతున్నారని చెప్పారు. ఆదివారం పూడూరు మండలం మేడికొండ గ్రామానికి చెందిన సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు అనంతరెడ్డి తదితరులు పార్టీలో చేరడంతో కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇతరులు కూడా తమ మండల పార్టీ అధ్యక్షుల సమన్వయంతో పార్టీలో చేరితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అందరినీ ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని