logo

సమాజాన్ని సన్మార్గం వైపు నడిపేది భగవద్గీత

సమాజానికి దిశానిర్దేశం చేస్తూ సన్మార్గం వైపు నడిపించేది భగవద్గీతని వక్తలన్నారు.

Published : 22 Apr 2024 03:29 IST

ప్రాజెక్ట్‌ భగవద్గీత ప్రారంభించిన శోభారాజు, నామామృతదాస, పి.గంగయ్య నాయుడు

నారాయణగూడ, న్యూస్‌టుడే: సమాజానికి దిశానిర్దేశం చేస్తూ సన్మార్గం వైపు నడిపించేది భగవద్గీతని వక్తలన్నారు. ఆదివారం ఫతేమైదాన్‌ క్లబ్‌లో మిహీరా ఇన్నోవేషన్స్‌ ఆధ్వర్యంలో ‘ప్రాజెక్ట్‌ భగవద్గీత’ ఆవిష్కరించారు. అన్నమాచార్య భావన వాహిని వ్యవస్థాపకురాలు డా.శోభరాజు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. న్యాయస్థానాల్లో భగవద్గీతపై ప్రమాణం చేసే దోషులు నిజం చెబితే న్యాయవాదులు పరిశ్రమించే అవకాశం ఉండదన్నారు. హరేకృష్ణ మూవ్‌మెంట్‌ హైదరాబాద్‌ ప్రభు నామామృత దాస మాట్లాడుతూ.. నిమిషం నిడివితో సామాజిక మాధ్యమాల ద్వారా భగవద్గీత శ్లోకాలు, తాత్పర్యాలను ప్రజలకు అందించే ప్రయత్నం గొప్పదన్నారు. హైకోర్టు సీనియర్‌ న్యాయవాది పి.గంగయ్యనాయుడు మాట్లాడారు. ప్రాజెక్ట్‌ భగవద్గీత వ్యవస్థాపకురాలు తనూజ చింతగుంట ప్రాజెక్ట్‌ ఉద్దేశాన్ని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని