logo

ఎన్నికలయ్యాక హరీశ్‌రావు చిట్టా విప్పుతాం

మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భావనతో అహంకారంతో మాట్లాడుతున్నారని, కుంభకోణాలకు పాల్పడిన చిట్టాను ఎన్నికల అనంతరం విప్పి కంటి మీద కునుకు లేకుండా చేస్తామని మల్కాజిగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు.

Published : 22 Apr 2024 03:29 IST

మాట్లాడుతున్న మైనంపల్లి హనుమంతరావు

శామీర్‌పేట, న్యూస్‌టుడే: మాజీ మంత్రి హరీశ్‌రావు ఇంకా అధికారంలోనే ఉన్నామనే భావనతో అహంకారంతో మాట్లాడుతున్నారని, కుంభకోణాలకు పాల్పడిన చిట్టాను ఎన్నికల అనంతరం విప్పి కంటి మీద కునుకు లేకుండా చేస్తామని మల్కాజిగిరి లోక్‌సభ ఇన్‌ఛార్జీ, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హెచ్చరించారు. ఆదివారం ఆయన శామీర్‌పేట మండలం తూంకుంట పుర పాలికలోని అంతాయిపల్లిలో సీఎం బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించేందుకు వచ్చారు. మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తోటకూర వజ్రేశ్‌యాదవ్‌లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. మల్లన్నసాగర్‌ ప్రాజెక్టులో బినామీ పేర్లతో మోసాలు, పలు ప్రాంతాల్లో జరిగిన భూకుంభకోణాలు, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతి, అక్రమాలను బయటకు తీస్తామన్నారు. రెండు పడక గదులతో పేదల కంటే గత పాలకులే లబ్ధి పొందారని ఆరోపించారు. మల్కాజిగిరి లోక్‌సభ అభ్యర్థి పట్నం సునీతారెడ్డి నామినేషన్‌కు సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని