logo

కంపుకొడుతున్న హుస్సేన్‌సాగర్‌

నాలాల నుంచి వస్తున్న వ్యర్థ జలాల శుద్ధిని గాలికొదిలేయడంతో హుస్సేన్‌సాగర్‌ మురికి కూపంలా మారుతోంది.

Updated : 22 Apr 2024 05:24 IST

పడిపోతున్న ఆక్సిజన్‌

సాగర్‌ ఒడ్డున పేరుకుపోయిన వ్యర్థాలు

ఈనాడు, హైదరాబాద్‌: నాలాల నుంచి వస్తున్న వ్యర్థ జలాల శుద్ధిని గాలికొదిలేయడంతో హుస్సేన్‌సాగర్‌ మురికి కూపంలా మారుతోంది. దీనికి తోడు ఎండలు అధికంగా ఉండటంతో ఎక్కడికక్కడ మురుగు పేరుకుపోయి పరిసర ప్రాంతాలు దుర్వాసన వస్తున్నాయి. సాయంత్రం సరదాగా వెళ్లి గడపాలనుకున్నా ఎక్కువ సమయం ఉండలేకపోతున్నామని సందర్శకులు వాపోతున్నారు. నిత్యం 400 ఎంఎల్‌డీల వ్యర్థజలాలు సాగర్‌లో కలుస్తుండగా సెలవు రోజుల్లో శుద్ధి చేయకుండానే వ్యర్థాలను వదులుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఫలితంగా నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ (డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌) క్రమంగా తగ్గుతోంది. తాజాగా పీసీబీ విడుదల చేసిన నివేదిక ఇందుకు ఊతమిస్తోంది. గత 3 నెలల్లో సాగర్‌ చుట్టూ ఉన్న 9 ప్రాంతాల్లో నీటి శాంపిళ్లను సేకరించి ల్యాబ్‌లో పరిశీలించగా అనేక చోట్ల డిజాల్వ్‌డ్‌ ఆక్సిజన్‌ నిర్దేశిత పరిమితి కన్నా తక్కువగా ఉందని తేలింది. సాధారణంగా లీటరు నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌ పరిమాణం 4 ఎంజీలు ఉండాలి. కానీ ఫిబ్రవరి, మార్చిలలో 3.2 సగటు నమోదైంది. నిర్దేశిత పరిమితుల ప్రకారం లీటరు నీటిలో బయోకెమికల్‌ ఆక్సిజన్‌ డిమాండ్‌ (బీవోడీ) 3 ఎంజీల కంటే తక్కువ ఉండాలి. మార్చిలో నీటి నమూనాలను పరిశీలించగా నెక్లెస్‌రోడ్‌ వద్ద అత్యధికంగా 111, బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు కార్యాలయం వద్ద 47, మిగిలిన చోట్ల సగటు 14గా నమోదైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని