logo

జోష్‌ .. వస్తలేదు

లోక్‌సభ ఎన్నికలకు గ్రేటర్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది.

Published : 22 Apr 2024 07:39 IST

కిందిస్థాయి కేడర్‌లో స్తబ్ధత
నేతల పిలుపునకు వేచి చూసే ధోరణి

ఈనాడు, హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికలకు గ్రేటర్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కిందిస్థాయి నేతలు, క్యాడర్‌లో ఉన్న జోష్‌.. ఇప్పుడు కనిపించడం లేదు. నేతల పిలుపు వస్తే చూద్దాంలే అన్నట్లు కిందిస్థాయి కార్యకర్తలు, చోటామోటా నేతలు ఉన్నారు. అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి. మహానగర పరిధిలో నాలుగు ఎంపీ స్థానాల్లో అన్ని పార్టీల నుంచి కీలక నేతలే రంగంలో ఉన్నారు. ఒక్కో నియోజకవర్గంలో లక్షల్లో ఓట్లు ఉండటం, అసెంబ్లీ మాదిరిగా ప్రతి ఓటుపై దృష్టి పెట్టే అవకాశం ఉండకపోవడంతో కూడా కింది స్థాయి కేడర్‌ ఎవరికివారు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. నామినేషన్ల పర్వం ముగిసిన తర్వాత నేతలు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అన్ని ప్రధాన పార్టీలు ప్రచార రథాలు సిద్ధం చేశాయి.  

ఖర్చులు తడిసి మోపెడు.. ప్రచారపర్వంలో జనసమీకరణే కీలకం. దీంతో నెల, 20 రోజుల ముందే ప్రచారంలోకి దిగితే ఖర్చు తడిసి మోపెడవుతుంది. ప్రచారం జరిగినన్ని రోజులూ జనసమీకరణ జరుపుతూ.. భోజనాలు ఇతరత్రా ఖర్చులను అభ్యర్థులే భరించాల్సిఉంది. బైక్‌ ర్యాలీలు, ప్రచార సభలకు భారీగా ఖర్చు చేయాల్సిందే. ప్రచారంలో పాల్గొనేవారికి రూ.300-500 ఇస్తే తప్పా పార్టీల జెండాలు మోసే వారు కరువయ్యారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఆఖరి 10-15 రోజులు ఎక్కువ ప్రచారం చేసుకునేలా అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని