logo

అభిమానం పోటెత్తి.. చెయ్యెత్తి జైకొట్టి

మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Updated : 23 Apr 2024 05:16 IST

సభ విజయవంతం.. కాంగ్రెస్‌లో నూతనోత్సాహం 

అభివాదం చేస్తున్న వజ్రేష్‌యాదవ్‌, రేవంత్‌రెడ్డి, పట్నం సునీతారెడ్డి

శామీర్‌పేట, జవహర్‌నగర్‌, న్యూస్‌టుడే: మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభకు నాయకులు ఆశించిన జనం కంటే అధికంగా రావడంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట మండలం తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని అంతాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్‌ జన జాతర బహిరంగ సభ ఏర్పాటుకు మూడు రోజుల నుంచి ఏర్పాట్లుచేశారు. ఇందుకు తగ్గట్టుగానే మల్కాజిగిరి లోకసభ నియోజకవర్గంలోని మేడ్చల్‌, ఉప్పల్‌, కుత్బుల్లాపూర్‌, కూకట్‌ పల్లి, మల్కాజిగిరి, కంటోన్మెంట్‌ ఎల్బీనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు జన సమీకరణ బాధ్యతలు చేపట్టి భారీగా తరలించడంతో సభా ప్రాంగణం జాతరను తలపించింది. సభా వేదికకు కిలోమీటరు దూరం నుంచే ట్రాఫిక్‌ స్తంభించడంతో అక్కడినుంచి అందరూ నడుచుకుంటూ రావడం కనిపించింది. పురుషులతో సమానంగా మహిళలు సైతం భారీగా తరలిరావడంతో రాజీవ్‌ రహదారి కీసర-శామీర్‌పేట రహదారులు జనంతో నిండిపోయాయి.

శ్రీధర్‌బాబు, మధుయాస్కీ, మహేందర్‌రెడ్డి మంతనాలు

  •  సాయంత్రం 5.27గంటలు.. సభా వేదికకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వచ్చారు.
  •  సాయంత్రం 6 తరువాత కూడా మహిళలు భారీగా సమావేశానికి హాజరయ్యారు.
  •  వేదికపై నాయకులను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేరుపేరునా పలకరించారు.
  •  మల్కాజిగిరి నియోజకవర్గ సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహన ఉంది.. ముఖ్యమంత్రి హోదాలో వాటిని పరిష్కరిస్తానంటూ ఈ సభావేదిక ద్వారా హామీ ఇచ్చారు.                  
  •  జవహర్‌నగర్‌ సమస్యలను  ముఖ్యమంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
  •  కాంగ్రెస్‌ జనజాతర సభకుహెలికాప్టర్‌లో వచ్చిన సీఎం..సభ ముగిసిన తర్వాత రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు వెళ్లారు. హెలికాప్టర్‌ సిద్ధం చేసినా రాత్రి వేళ కావడంతో వెళ్లలేకపోయారు.
  •  ముఖ్యమంత్రి దాదాపుగా 28నిమిషాల పాటు ప్రసంగించారు. ప్రతి మాటకు కార్యకర్తల నుంచి కేరింతలు, హర్షద్వానాలు వినిపించాయి.

నినాదాలు చేస్తున్న కార్యకర్తలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని