logo

యువతే దేశానికి సంపద

యువతే దేశానికి సంపద అని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ విభాగం పట్టభద్రుల దినోత్సవం నిర్వహించారు.

Published : 18 May 2024 01:41 IST

జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా

మాట్లాడుతున్న అరుణ్‌కుమార్‌ మిశ్రా

పటాన్‌చెరు, న్యూస్‌టుడే: యువతే దేశానికి సంపద అని జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ అరుణ్‌కుమార్‌ మిశ్రా అన్నారు. శుక్రవారం పటాన్‌చెరు మండలం రుద్రారం గ్రామం గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో కౌటిల్య స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ పాలసీ విభాగం పట్టభద్రుల దినోత్సవం నిర్వహించారు. 25 మంది విద్యార్థులకు పోస్టు గ్రాడ్యుయేషన్‌ పట్టాలు గీతం అధ్యక్షుడు శ్రీభరత్‌తో కలిసి అందజేశారు. మల్లికార్జున్‌రావు, ప్రణీత, ప్రియ భట్కర్‌ బంగారుపతకాలు అందుకోగా అంతర మైత్ర డీన్‌ అవార్డు అందుకున్నారు. పబ్లిక్‌ పాలసీ మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో ప్రథమ ర్యాంకర్‌గా ప్రణీతకు గీతం ప్రెసిడెంట్‌ పేరుతో నెలకొల్పిన బంగారు పతకాన్ని అందజేశారు. కార్యక్రమంలో కౌటిల్య డీన్‌ సయ్యద్‌ అక్బరుద్దీన్, అదనపు ఉపకులపతి డీఎస్‌రావు, అర్చనాగుప్తా, రిజిస్టార్‌ గుణశేఖరన్, ప్రతీక్‌ కన్వల్‌ తదితరులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని