logo

అతివేగానికి ఒకరు బలి

మాదాపూర్‌లో ఓ కారు రెండు ఆటో ట్రాలీలను ఢీకొట్టి ఇద్దరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మాదాపూర్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు  వివరాల ప్రకారం.. మాదాపూర్‌ మేఘా హిల్స్‌కు చెందిన మద్దూరు శ్రీనివాస్‌(35), మణికొండ చిత్రపురి కాలనీవాసి సంకు వీరరాఘవులు పాల వ్యాపారం చేస్తుంటారు.

Updated : 18 May 2024 02:23 IST

రెండు ఆటో ట్రాలీలను ఢీకొట్టి కారు బీభత్సం

ప్రమాదానికి కారణమైన కారు

రాయదుర్గం: మాదాపూర్‌లో ఓ కారు రెండు ఆటో ట్రాలీలను ఢీకొట్టి ఇద్దరిపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మాదాపూర్‌ ఎస్‌ఐ వెంకటేశ్వర్లు  వివరాల ప్రకారం.. మాదాపూర్‌ మేఘా హిల్స్‌కు చెందిన మద్దూరు శ్రీనివాస్‌(35), మణికొండ చిత్రపురి కాలనీవాసి సంకు వీరరాఘవులు పాల వ్యాపారం చేస్తుంటారు. శుక్రవారం తెల్లవారుజామున మాదాపూర్‌ మెట్రో పిల్లర్‌ నంబర్‌ 1715 వద్ద వారు తమ ఆటోట్రాలీలను రోడ్డు పక్కన నిలిపి పాల ట్రేలను మార్చుకుంటున్నారు. అదే సమయంలో వేగంగా వచ్చిన కారు.. ఆ వాహనాలను ఢీకొని శ్రీనివాస్‌, రాఘవులపైకి దూసుకెళ్లడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రికి తరలించగా..శ్రీనివాస్‌ మృతి చెందారు. రాఘవులు చికిత్స పొందుతున్నాడు. కారుడ్రైవరు జి.రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు.

మరో ఘటనలో ముగ్గురికి గాయాలు

మెహిదీపట్నం:లంగర్‌హౌస్‌లో కారు బీభత్సం సృష్టించింది.  ఇన్‌స్పెక్టర్‌ రఘుకుమార్‌ వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్‌ బండ్లగూడకు చెందిన డా.రోహిత్‌ శుక్రవారం రాత్రి కారులో ఇంటికి వెళుతున్నాడు. బాపూఘాట్‌ సమీపంలోకి రాగానే  రోడ్డు దాటుతున్న వ్యక్తిని తప్పించే క్రమంలో  కారు దూసుకెళ్లి ఫుట్‌పాత్‌పైకి దూసుకెళ్లింది. అక్కడ పండ్లు విక్రయించే సోహెల్‌(35), తోహిత్‌(28), తరుణ్‌(20)కు గాయాలయ్యాయి. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు