logo

మహానగరానికి గోదావరి భరోసా

వేసవిలో నగరానికి గోదావరి జలాల భరోసా దక్కింది. వాస్తవానికి మే 1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అత్యవసర పంపింగ్‌తో నగరానికి నీటిని తరలించడానికి జలమండలి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ...ఎల్లంపల్లిలో నీటి మట్టం తగినంత ఉండటంతో ఆ పరిస్థితి రాలేదని అధికారులు చెబుతున్నారు.

Updated : 18 May 2024 03:45 IST

అత్యవసర పంపింగ్‌ లేకుండానే సరఫరా
రెండు నెలల వరకు ఇబ్బంది లేదిక
ఈనాడు, హైదరాబాద్‌

వేసవిలో నగరానికి గోదావరి జలాల భరోసా దక్కింది. వాస్తవానికి మే 1 నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి అత్యవసర పంపింగ్‌తో నగరానికి నీటిని తరలించడానికి జలమండలి ప్రణాళిక సిద్ధం చేసినప్పటికీ...ఎల్లంపల్లిలో నీటి మట్టం తగినంత ఉండటంతో ఆ పరిస్థితి రాలేదని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం ఎల్లంపల్లి నీటి మట్టం 462 అడుగుల వరకు ఉంది. 455 అడుగులకు తగ్గినప్పుడు అత్యవసర పంపింగ్‌ అవసరం కానుంది.  గోదావరి నుంచి నిత్యం నగరానికి 172 మిలియన్‌ గ్యాలన్లు తరలిస్తున్నారు. ఈ నెలకు ఒక టీఎంసీ వరకు జలాలు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్న నీటి మట్టం పరిగణలోకి తీసుకుంటే...ఇంకో రెండు నెలల వరకు ఎలాంటి అత్యవసర పంపింగ్‌ లేకుండానే నగరానికి నీటిని తరలించే అవకాశం ఉందని అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే గోదావరి పరివాహక ప్రాంతంలో అడపాదడపా కురుస్తున్న వానలు, త్వరలో రుతుపవనాలు రానున్న దృష్ట్యా అత్యవసర పంపింగ్‌ అవసరమే ఉండక పోవచ్చునని అంచనా వేస్తున్నారు.

సాగర్‌ నుంచి మూడు దశల్లో..

మరోవైపు నాగార్జునసాగర్‌లో అత్యవసర పంపింగ్‌ కొనసాగుతోంది. నగరానికి అవసరమయ్యే 270 ఎంజీడీల నీళ్లను మూడు దశల్లో నగరానికి తరలిస్తున్నారు. సాగర్‌ పూర్తి నీటి మట్టం 590 అడుగులు కాగా...ప్రస్తుతం 504 అడుగులకు చేరింది. నీటి మట్టం 510 అడుగులకు తగ్గినప్పటి నుంచే ఇక్కడ జలమండలి అత్యవసర పంపింగ్‌ ద్వారా నగరానికి నీటిని అందిస్తోంది. మరోవైపు జంటజలాశయాలైన ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ కొంతవరకు ఆదుకుంటున్నాయి.  . నగరంలో భూగర్భ జలాలు అడుగంటడంతో ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. వచ్చే వేసవి నాటికి నగరంలో నీటి ఇబ్బంది లేకుండా పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు