logo

కాపాడకపోతే కష్టమే

హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ సవాలుగా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్ల కింద మార్చి ఆదాయాన్ని సమకూర్చుకుంది.

Updated : 18 May 2024 03:44 IST

హెచ్‌ఎండీఏ ఖాతాలో కోట్ల విలువైన భూములు
పర్యవేక్షణ లేక ఆక్రమణల పర్వం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలోని రూ.వేల కోట్ల విలువైన భూముల పరిరక్షణ సవాలుగా మారుతోంది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో లేఅవుట్ల కింద మార్చి ఆదాయాన్ని సమకూర్చుకుంది. ఇంకా పలు చోట్ల వేల ఉన్నప్పటికీ వాటిని కాపాడుకోవడం కోసం  సరైన చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. గతంలో జవహర్‌నగర్‌ భూముల ఆక్రమణల వ్యవహారంలో ఓ కార్పొరేటర్‌ హస్తం ఉన్నట్లు తేలిన సంగతి తెలిసిందే.  శంషాబాద్‌లోనూ హెచ్‌ఎండీఏకు చెందిన 50 ఎకరాలను ఓ వ్యక్తి ఆక్రమించడంతో ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడాల్సి వచ్చింది.  మియాపూర్‌లో హెచ్‌ఎండీఏ భూములను కొందరు ఆక్రమించి పక్కా ఇళ్లను సైతం నిర్మించారు. నగరం చుట్టుపక్కల హెచ్‌ఎండీఏ ల్యాండ్‌ బ్యాంకులో ఉన్న భూములకు చుట్టూ ఇనుప కంచెలు నిర్మించినప్పటికీ వాటిని తొలగించి మరీ ఆక్రమిస్తున్నారు. 

తొలుత షెడ్లు వేసి.. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో భూములు రూ.కోట్లు పలుకుతుండటంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. ఎలాగైనా తొలుత వాటిలో చిన్నపాటి షెడ్లు వేసి వాటిని వివాదాల్లోకి లాగుతున్నారు. కోర్టుల్లో కేసులు వేస్తూ ఆ భూములపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారు. కొందరు ఆక్రమణదారులు ముఠాలుగా ఏర్పడి కబ్జాలకు తెగబడుతున్నారు. జవహర్‌నగర్‌ పరిధిలో ఎక్కువగా ఈ తరహా దందా నడుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని