logo

రైల్వే, ఆదాయపన్నుశాఖలో ఉద్యోగాల పేరుతో మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన  నిందితుడిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు.  టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ ఎస్‌.రష్మీ పెరుమాళ్‌ కథనం ప్రకారం..

Published : 19 May 2024 03:28 IST

రెజిమెంటల్‌బజార్‌:  ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ మోసగించిన  నిందితుడిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్, గోపాలపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు.  టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ ఎస్‌.రష్మీ పెరుమాళ్‌ కథనం ప్రకారం.. ఏపీలోని తెనాలికి చెందిన సూర్యదేవర అనిల్‌కుమార్‌ (34) యాప్రాల్‌లో ఉంటున్నాడు. సులువుగా డబ్బు సంపాదించేందుకు వాట్సప్‌ గ్రూప్‌లో ఉన్న వారిలో ఉద్యోగాలకు ప్రయత్నిస్తున్న వారి నెంబర్లను గుర్తించి పరిచయం చేసుకుంటాడు. ఆదాయపన్నుశాఖలో, దక్షిణ మధ్య రైల్వేలో బ్యాక్‌లాగ్‌ పోస్టుల గురించి వారికి తెలియజేసేవాడు. ఈ క్రమంలో పరిచయమైన షేక్‌ హుస్సేన్‌కు పాట్నాలోని ఆదాయపన్నుశాఖలో ఇన్‌స్పెక్టర్‌ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి పంపించాడు. అక్కడ నకిలీ ఆర్డర్‌ ఇప్పించాడు. తరువాత  నగరానికి రప్పించి టికెట్‌ ఎగ్జామినర్‌ (టీటీఈ) ఉద్యోగమంటూ నకిలీ లెటర్‌ ఇచ్చి 2022 జూన్, జులైలో రూ.10 లక్షలు తీసుకున్నాడు. తనకు పరిచయం ఉన్న సికింద్రాబాద్‌ రైల్వే టీటీఈ నవీన్‌కుమార్‌తో శిక్షణ ముసుగులో అతడిని ఆరు నెలలు పంపించాడు. చివరికి మోసపోయినట్లు గుర్తించిన హుస్సేన్‌  పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడిని రిమాండుకు తరలించారు. నిందితుడు గతంలోనూ ఇలా మోసాలకు పాల్పడ్డాడు. ఈ కేసుతో సంబంధం ఉన్న టీటీఈ నవీన్‌కుమార్‌కు నోటీసులు జారీ చేశారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు