logo

పోరాటయోధుల చరిత్ర గ్రంథస్థం చేస్తాం

తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల  జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ

Published : 19 May 2024 03:31 IST

మాట్లాడుతున్న ననుమాసస్వామి

సికింద్రాబాద్, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్రసాధన కోసం జరిగిన తొలి పోరాటంలో అమరులైన వీరులు, జైలుకెళ్లిన, అంగవైకల్యం చెందిన యోధుల త్యాగాలు చరిత్రకెక్కలేదని, ఆ త్యాగధనుల  జీవితాలను గ్రంథ]స్థం చేస్తున్నట్లు తెలంగాణ పోరాటయోధుల సంఘం అధ్యక్షుడు, ప్రొఫెసర్‌ ననుమాసస్వామి తెలిపారు. జూన్‌ 2న దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరుగున పడిన తొలితరం ఉద్యమయోధులను సమావేశపరిచి, వారి ఉద్యమచరిత్రను గ్రంథస్థం చేసేందుకు శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. శనివారం సీతాఫల్‌మండిలో నిర్వహించిన దశాబ్ది సన్నాహక సమావేశంలో   1968-69లో రెండేళ్లు జైలు జీవితాన్ని గడిపిన జనగామ జిల్లాకు చెందిన ఆడెపు వెంకయ్య, అనుముల రామయ్య, బి.ఇన్నారెడ్డి, ఉపేందర్‌రావులతో కలిసి   మాట్లాడాకె, ఇప్పటికే తాము సేకరించిన  2100 మంది ఉద్యమకారుల వివరాలను ప్రభుత్వానికి అందజేశామన్నారు. రాష్ట్రం ఏర్పడిన దశాబ్దానికైనా తొలితరం ఉద్యమకారుల చరిత్రలను వెలుగులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.్చ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని