logo

ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలి

రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు.

Published : 19 May 2024 03:33 IST

హరితిలక్‌సింగ్‌కు నియామకపత్రం అందజేస్తున్న ఆర్‌.కృష్ణయ్య, చిత్రంలో భరత్‌కుమార్, గుజ్జ కృష్ణ, ఉదయ్‌

గోల్నాక, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టాన్ని తేవాలని, ఒక యాజమాన్యం కింద ఒకే విద్యా సంస్థ ఉండాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్‌.కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. ఒకే అనుమతితో గొలుసుకట్టుగా ప్రైవేటు, కార్పొరేట్‌ విద్యాసంస్థలను నిర్వహిస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తుండడంతో విద్యార్థులు సహా తల్లిదండ్రులు ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. శనివారం బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్‌ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో.. నింబోలిఅడ్డాకు చెందిన హరితిలక్‌సింగ్‌కు సంఘం గ్రేటర్‌ హైదరాబాద్‌ ఉపాధ్యక్షుడిగా నియామకపత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చర్యలు చేపట్టకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని ఆర్‌.కృష్ణయ్య హెచ్చరించారు. బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు భరత్‌కుమార్, ఉదయ్‌ తదితరులు పాల్గొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు