logo

నకిలీ సర్టిఫికెట్ల ముఠా గుట్టురట్టు

పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్‌వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది.

Updated : 19 May 2024 05:32 IST

స్వాధీనం చేసుకున్న ధ్రువీకరణ పత్రాలతో నిందితులు 

చైతన్యపురి, న్యూస్‌టుడే: పలు విశ్వవిద్యాలయాల పేరిట నకిలీ ధ్రువీకరణ పత్రాలు విక్రయిస్తున్న ముఠాలోని సభ్యుడితో పాటు కొనుగోలు చేసేందుకు వచ్చిన వ్యక్తిని మహేశ్వరం ఎస్‌వోటీ బృందం, చైతన్యపురి పోలీసుల సహకారంతో అరెస్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రేతిబౌలి పరిధి నాలానగర్‌కు చెందిన మహమ్మద్‌ అబ్బర్‌ హుస్సేన్‌ (45) ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన రాంసింగ్‌ సహకారంతో నగరంలో నకిలీ విద్యార్హత సర్టిఫికెట్లు విక్రయిస్తున్నాడు. చైతన్యపురి లావెరన్‌ కాంప్లెక్స్‌లో దుకాణం అద్దెకు తీసుకుని.. ఒక్కో దానికి రూ.30 నుంచి 40 వేలకు అమ్ముతున్నాడు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దాడి చేసి, మహమ్మద్‌ అబ్బర్‌ హుస్సేన్‌తో పాటు సర్టిఫికెట్‌ కొనుగోలుకు వచ్చిన లంగర్‌హౌస్‌ చెందిన సయ్యద్‌ ఇషాని మహమ్మద్‌ (28)ని అరెస్టు చేశారు. మహాత్మాగాంధీ కాశీ విద్యాపీఠ్‌ వారణాసి, బాబాసాహెబ్‌ భీంరావు అంబేడ్కర్‌ యూనివర్సిటీ బీహార్‌ పేరిట ఉన్న పలు ధ్రువీకరణ పత్రాలు, ల్యాప్‌టాప్, రెండు చరవాణిలు స్వాధీనం చేసుకున్నారు. మెహిదీపట్నానికి చెందిన అశ్వక్, హైఫా, దిల్లీకి చెందిన రాహుల్‌ సూద్, గుజరాత్‌కు చెందిన సచ్చి పటేల్‌ తదితరులు గతంలో ధ్రువీకరణ పత్రాలు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని