logo

12 శాతం రిజర్వేషన్‌ కోసం మాదిగ జన సభలు

తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి తెలిపారు.

Published : 19 May 2024 03:48 IST

మాట్లాడుతున్న పిడమర్తి రవి

ఖైరతాబాద్‌: తెలంగాణలో మాదిగలకు 12 శాతం రిజర్వేషన్‌ కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ‘మాదిగ జన సభలు’ నిర్వహిస్తున్నట్లు మాదిగ ఐకాస ఛైర్మన్, తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పిడమర్తి రవి తెలిపారు. ఏబీసీడీ సాధిస్తామని, అయితే 7 శాతంతో కాదని, 12 శాతం రిజర్వేషన్‌తో అని స్పష్టం చేశారు. శనివారం సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో మాట్లాడుతూ.. ప్రతి సభలోనూ సీఎం రేవంత్‌రెడ్డి వర్గీకరణ పూచీకత్తు తనదని చెప్తూ వస్తున్నారని, కుల గణన తర్వాత తామెంత ఉంటే అంత ఇవ్వాలని కోరుతున్నామన్నారు. రిజర్వేషన్‌  విషయంలో మాదిగలను అప్రమత్తం చేసేందుకు జూన్‌ 5 తర్వాత  సభలు నిర్వహిస్తామన్నారు. సంఘాల నేతలు పుట్టపాగ నర్సింగరావు, ఉపేందర్, బాలరాజు, వక్కలంక చంద్రశేఖర్, ఎల్లేష్, వంశీ, మిట్ట యాదన్న, మల్లికార్జున్‌ తదితరులు మాట్లాడారు. ్చ 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని