logo

గ్రూప్‌-1 ప్రిలిమినరీకి ముమ్మర ఏర్పాట్లు

జిల్లాలో జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ తెలిపారు.

Published : 19 May 2024 03:58 IST

దృశ్య మాధ్యమ సమావేశంలో పాల్గొన్న రాహుల్‌శర్మ, ఎస్పీ కోటిరెడ్డి, అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి 

వికారాబాద్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే: జిల్లాలో జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు అన్ని రకాల చర్యలు తీసుకున్నామని జిల్లా అదనపు పాలనాధికారి రాహుల్‌శర్మ తెలిపారు. శనివారం రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి ఉన్నతాధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, అదనపు కలెక్టర్లు, అదనపు ఎస్పీలు, రీజినల్‌ కో ఆర్డినేటర్లు, నోడల్‌ అధికారులతో దృశ్య మాధ్యమ సమావేశంలో మాట్లాడారు. అనంతరం రాహుల్‌శర్మ మాట్లాడుతూ జూన్‌ 9న నిర్వహించే గ్రూప్‌-1 పరీక్షను జిల్లా నుంచి 5468 మంది అభ్యర్థులు రాస్తున్నారని తెలిపారు. ఇందుకు గాను 13 పరీక్షా కేంద్రాలను గుర్తించామన్నారు. వికారాబాద్‌లో 7, తాండూరులో 4, పరిగిలో 2 కేంద్రాలను గుర్తించినట్లు వివరించారు. చైర్మన్‌ సూచించిన విధంగా అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా తగిన విధంగా సౌకర్యాలను కల్పిస్తామన్నారు. జిల్లా ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ పటిష్ఠ పోలీసు బందోబస్తు మధ్య శాంతియుతంగా పరీక్షలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. పరీక్షా కేంద్రాల వద్ద మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను నియమిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, ఏడీలు అమరేందర్, కృష్ణలు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని