logo

జూలో ఖడ్గమృగాల సంతతి వృద్ధి

నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్‌క్లోజర్‌ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌) దత్తత తీసుకొంటోంది.

Published : 19 May 2024 04:16 IST

ఎన్‌క్లోజర్‌ నిర్మాణానికి ఐవోసీఎల్‌ చేయూత

ఖడ్గమృగం ఎన్‌క్లోజర్‌ ఎదుట ఐవోసీఎల్‌ ప్రతినిధులు

చార్మినార్‌: నగర నెహ్రూ జూ పార్కులో ఖడ్గమృగాల సంతతి క్రమంగా పెరుగుతోంది. వాటి ప్రదర్శన, విశ్రాంతికి మరో ఎన్‌క్లోజర్‌ నిర్మాణానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆరేళ్ల నుంచి వాటిని ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(ఐవోసీఎల్‌) దత్తత తీసుకొంటోంది. సంస్థ ‘మస్కట్‌’ ఖడ్గమృగం కావడంతో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తోంది. కొత్త ఎన్‌క్లోజర్‌తోపాటు ప్రత్యేకంగా నైట్‌హౌజ్‌(విశ్రాంతి గది) నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల జూ డిప్యూటీ క్యూరేటర్‌ ఎ.నాగమణితో ఐవోసీఎల్‌ అధికారులు నిర్మాణంపై సమీక్షించారు. 

‘గాలికుంటు’తో అంతరించి.. క్రమంగా పెరిగి: 13 ఏళ్ల క్రితం జూలో ఖడ్గమృగాల సంతతి బాగానే ఉండేది. క్రమేణా గాలికుంటు వ్యాధితో అవి అంతరించిపోయాయి. 2011లో పాట్నా జూ నుంచి  జత ఖడ్గమృగాలు సరస్వతి(ఆడ), సూరజ్‌(మగ)లను తెప్పించారు. ఏడాది క్రితం ప్రేమ అనే ఆడ ఖడ్గమృగానికి జన్మనిచ్చాయి. ఐవోసీఎల్‌ జూలోని ఐదు ఖడ్గమృగాలను దత్తత తీసుకొని వాటి పోషణ, ఖర్చులకు ఏడాదికి రూ.5లక్షలు ఇస్తోంది.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని