logo

పుస్తకాలకు, బల్లలకు ఆకతాయిల నిప్పు

జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్‌కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు.

Updated : 19 May 2024 05:22 IST

తాండూరు గ్రామీణ, న్యూస్‌టుడే: జడ్పీ ఉన్నత పాఠశాలలో పాఠ్య పుస్తకాలు, బల్లలకు ఆకతాయిలు నిప్పు పెట్టిన సంఘటన తాండూరు మండలం కరణ్‌కోటలో జరిగింది. శనివారం పాఠశాలలోకి ప్రవేశించిన ఆకతాయిలు సామగ్రి నిల్వ గదిలోకి వెళ్లారు. అక్కడ నిల్వ ఉంచిన వేల సంఖ్య పాఠ్యపుస్తకాలు, విద్యార్థులు కూర్చునే బల్లలకు నిప్పుపెట్టారు. పొగలు రావడంతో స్థానికులు గమనించి లోపలికి వెళ్లి పరిశీలించగా మంటల్లో పుస్తకాలు కాలిపోవడాన్ని గుర్తించారు. వెంటనే బిందెల్లో నీరు తెచ్చి కుమ్మరించడంతో మంటలను ఆర్పివేశారు. తరగతి గదిలో గోడలు పొగతో మసిబారాయి. పాఠ్యపుస్తకాలు బూడిదగా మారాయి. కిటికీలు, తలుపులు దెబ్బతిన్నాయి. గత నెలలోనూ ఆకతాయిలు దస్త్రాలు, సామగ్రిని ధ్వంసం చేయడంతో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌గౌడ్‌ ఠాణాకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తాజాగా మరోసారి ఏకంగా నిప్పు పెట్టడంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల ప్రాంగణంలోకి కొందరు ఆకతాయిలు ప్రతిరోజు ప్రవేశించి ధూమపానం, మద్యపానం చేస్తున్నారని ఆరోపించారు. నిఘా కెమెరాల్లోని ఫుటేజీ ఆధారంగా ఆకతాయిలను పోలీసులు వెంటనే గుర్తించి కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు