logo

గంటలో కుంటలా...

వరుణుడు మరోసారి నగరంపై ఉరిమాడు. శనివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, హయత్‌  నగర్‌లో అరగంట నుంచి గంట వ్యవధిలో కుండపోతగా పడింది. అత్యధికంగా  లింగంపల్లిలో 6.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది.

Published : 19 May 2024 04:27 IST

ఈనాడు, హైదరాబాద్‌
భారీ వర్షంతో చెరువును  తలపించిన విజయవాడ హైవే

ఎల్బీనగర్‌ పరిధి చింతల్‌కుంట వద్ద తటాకాన్ని తలపిస్తున్న రహదారి

వరుణుడు మరోసారి నగరంపై ఉరిమాడు. శనివారం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లింగంపల్లి, హయత్‌  నగర్‌లో అరగంట నుంచి గంట వ్యవధిలో కుండపోతగా పడింది. అత్యధికంగా  లింగంపల్లిలో 6.88 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఎల్బీనగర్‌ పరిధిలోని చింతల్‌కుంట, హయత్‌నగర్‌ వద్ద జాతీయ రహదారి చెరువును తలపించింది. వాహనదారులు రెండు గంటలకుపైగా నరకం చూశారు. ఆదివారం కూడా రంగారెడ్డి జిల్లా పరిధిలో వర్షం కురిసే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.  

బైరామల్‌గూడ పైవంతెన వద్ద వరద నిలవడంతో ఆగిన ట్రాఫిక్‌

ఆర్కేపురం కాలనీలో ప్రవాహం

తార్నాక హుడా కాంప్లెక్స్‌లోకి చేరిన వాన నీరు

ఎల్‌బీనగర్‌లో కనువిందు చేసిన ఇంద్రధనస్సు 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని