logo

కలుద్దామని పిలిచి.. గొలుసు చోరీ

సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది.

Published : 20 May 2024 01:53 IST

ఆన్‌లైన్‌ స్నేహితుల దాష్టీకం..

వనస్థలిపురం: సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులు.. ఓ ఐటీ ఉద్యోగిని హింసించి బంగారు గొలుసు అపహరించిన ఘటన వనస్థలిపురం ఠాణా పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన శోభన్‌బాబు (30) ఐటీ ఉద్యోగి. ఓ ఆన్‌లైన్‌ యాప్‌లో పరిచయమైన వ్యక్తులు.. స్నేహితులుగా మారారు. మూడు రోజుల క్రితం అతను నగరానికి రాగా.. కలుద్దామని కోరారు. ఎల్బీనగర్‌లో కలవగా, అతడిని బలవంతంగా గుర్రంగూడ అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి.. శారీరకంగా హింసించారు. అనంతరం అతని మెడలోని రెండు తులాల బంగారు గొలుసు తీసుకొని పారిపోయారు. మోసపోయిన శోభన్‌బాబు వనస్థలిపురం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు.. రమావత్‌ కిరణ్‌కుమార్, పవన్, బాబు, నాగరాజు, రమావత్‌ రోహిత్, నేనావత్‌ మకత్‌లాల్‌లను అరెస్టు చేశారు. పత్లావత్‌ రమేశ్‌ పరారీలో ఉన్నాడు. ఈ ఏడుగురు నిందితులు ఇదే తరహాలో గతంలో ఆదిభట్లలోనూ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని