logo

ఎంఎస్‌ఎంఈ యూనిట్ల అద్దె కష్టాలకు చెక్‌

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్‌ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది.

Updated : 20 May 2024 04:07 IST

వావిలాలలో అభివృద్ధి పనులకు టీఎస్‌ఐఐసీ పచ్చజెండా

ఈనాడు, హైదరాబాద్‌: సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అద్దె కష్టాలు, యూనిట్‌ విస్తరణ సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. సంగారెడ్డి జిల్లా జిన్నారంలోని వావిలాలకు యూనిట్ల తరలింపునకు తొలి అడుగు పడింది. దీంతో పరిశ్రమలను అవుటర్‌ అవతలికి తరలించాలంటూ గత కొన్నేళ్లుగా అభ్యర్థిస్తున్న నిర్వాహకులకు ఊరట కల్పించినట్టయ్యింది. తొలిదశలో బాలానగర్‌లోని 200కు పైగా పరిశ్రమల కోసం 60 ఎకరాలను కేటాయించడంతో పాటు మౌలిక వసతుల కల్పన తదితర అభివృద్ధి పనులను చేపట్టేందుకు టీఎస్‌ఐఐసీ (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ) అంగీకరించింది.    
అద్దె కష్టాలు ఉండవిక.. బాలానగర్‌ పారిశ్రామికవాడలో మొత్తం 1800కి పైగా పరిశ్రమలున్నాయి. ఇందులో ఇంజినీరింగ్, ప్లాస్టిక్, ఫ్యాబ్రికేషన్, ఫుడ్‌ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, వివిధ రకాల ఔషధాలు, ఎలక్ట్రికల్‌తో పాటు అనేక కంపెనీలున్నాయి.    ఆయా సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఆర్డర్లు ఇచ్చే పరిశ్రమలు నగరానికి దూరంగా ఉండటంతో రవాణా ఖర్చులు భరించడం నిర్వాహకులకు కష్టంగా మారింది. ప్రస్తుతం ఇక్కడ 100 చదరపు అడుగుల స్థలానికే రూ.1లక్ష అడ్వాన్సు, ప్రతినెలా రూ.20వేల అద్దె చెల్లించాల్సి వస్తోంది. దీనికి తోడు ఆర్డర్ల ప్రకారం ఉత్పత్తిని పెంచేలా యంత్రాలను సమకూర్చుకునే స్థలం లేకపోవడం, పరిశ్రమను విస్తరించే అవకాశం లేకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.  వావిలాలకు పరిశ్రమలు తరలిస్తే ఈ కష్టాలు ఉండవని పరిశ్రమల నిర్వాహకులు చెబుతున్నారు. బాలానగర్‌ మైక్రో, స్మాల్‌ ఇండస్ట్రీస్‌ అసోసియేషన్‌ (బీఎమ్‌ఎస్‌ఐఏ)కి సంగారెడ్డి జిల్లా వావిలాల గ్రామంలో సర్వేనెంబర్‌ 190లోని 60 ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం గతేడాది ఉత్తర్వులు జారీ చేసింది. మార్కెట్‌ విలువ ప్రకారం ఎకరానికి రూ.1.80కోట్లు చెల్లించి సొంతంగా అభివృద్ధి (టిఐఎఫ్‌ పద్ధతిలో) చేసుకునేలా కంఫర్ట్‌ లెటర్‌ ఇవ్వడంలో ఆలస్యం జరగడంతో ప్రక్రియలో జాప్యం జరిగింది. తర్వాత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో దస్త్రంలో కదలిక వచ్చింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు