logo

కంటికి రెప్పలా.. కదిలారు

పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్‌పై    అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్‌ రన్‌’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్‌సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్‌ డీసీపీ డా.జి.వినీత్‌ ప్రారంభించారు.

Published : 20 May 2024 02:40 IST

పిల్లల్లో ఏర్పడే కంటి క్యాన్సర్‌పై    అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఆధ్వర్యంలో ఆదివారం ‘వైటథాన్‌ రన్‌’ పేరిట పరుగు నిర్వహించారు.హెచ్‌సీయూలో జరిగిన ఈ పరుగును మాదాపూర్‌ డీసీపీ డా.జి.వినీత్‌ ప్రారంభించారు. ఎల్వీ ప్రసాద్‌ ఐ  ఇన్‌స్టిట్యూట్‌ డాక్టర్‌ స్వాతి కల్కి మాట్లాడుతూ.. పరుగు ద్వారా సేకరించిన నిధులను రెటినోబ్లాస్టోమాతో బాధపడుతున్న పిల్లలకు చికిత్స చేయడానికి, క్యాన్సర్‌పై పరిశోధనకు ఉపమోగించనున్నట్లు పేర్కొన్నారు. ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇన్‌స్టిట్యూట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైౖర్‌ డా.ప్రశాంత్‌గార్గ్, అపోలో క్యాన్సర్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌ డా.విజయానంద్‌రెడ్డి  పాల్గొన్నారు.

న్యూస్‌టుడే, గచ్చిబౌలి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని