logo

తెలుగు జాతీయతకు ప్రతీక ప్రకాశం పంతులు

తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్‌ నిర్మాతగా,  అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్‌బాబు కీర్తించారు.

Published : 21 May 2024 01:12 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: తెలుగు జాతీయతకు ప్రతీకగా, ఆంధ్రప్రదేశ్‌ నిర్మాతగా,  అలుపెరుగని కార్యదీక్షాపరుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని మంత్రి శ్రీధర్‌బాబు కీర్తించారు. సోమవారం ప్రకాశం సంస్థ ఆధ్వర్యంలో అసెంబ్లీ ఎదురుగా ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం వారిని స్ఫూర్తిగా పరిగణిస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రకాశం పంతులు మనవడు టంగుటూరి గోపాలకృష్ణ నివాళులర్పించారు. టంగుటూరి శ్రీరామ్‌ మాట్లాడుతూ.. బ్రిటీషు మిలిటరీ, రజాకార్ల సైన్యం వందనాలు స్వీకరించిన ఏకైన తెలుగు తేజం ప్రకాశం పంతులు అని కొనియాడారు. సంస్థ ప్రధానకార్యదర్శి ఎన్‌.రామచంద్రారావు, ఎమ్మెల్సీ వాణీదేవి, కేంద్ర మాజీ మంత్రి డా.వేణుగోపాలాచారి, డా.మోహన్‌రావు, రాజశేఖర్, వాణీ ప్రదీప్, నిరంజన్‌ దేశాయ్‌లు పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని