logo

రేవ్‌ పార్టీ హైదరాబాద్‌లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..

బెంగళూరు శివారులో రేవ్‌ పార్టీ ఉదంతం హైదరాబాద్‌లో ప్రకంపనలు రేపుతోంది. నగర శివార్లలోని ఫాంహౌస్‌లలో తరచూ డ్రగ్స్‌ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు.

Published : 21 May 2024 05:59 IST

ఈనాడు, హైదరాబాద్‌: బెంగళూరు శివారులో రేవ్‌ పార్టీ ఉదంతం హైదరాబాద్‌లో ప్రకంపనలు రేపుతోంది. నగర శివార్లలోని ఫాంహౌస్‌లలో తరచూ డ్రగ్స్‌ పట్టుబడడంతో పోలీసులు కఠిన చర్యలకు దిగారు. రేవ్‌ పార్టీలు, అసాంఘిక కార్యక్రమాలకు అవకాశం లేకుండా నిఘా ఉంచారు. ఫాంహౌస్‌ల యజమానులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. డ్రగ్స్, ఇతర మత్తుపదార్థాల రవాణా, విక్రయాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని రాడిసన్‌ హోటల్‌లో డ్రగ్స్‌ పార్టీ కేసులో సినీ పరిశ్రమ సహా వివిధ రంగాల ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ పార్టీ వెనుక లింకుల్ని ఛేదించగా గోవా జైలులో ఉండే డ్రగ్స్‌ స్మగ్లర్ల పేర్లు బయటకొచ్చాయి. అంతకుముందు  టీఎస్‌ న్యాబ్‌ ఆధ్వర్యంలో రాజకీయ, సినీ ప్రముఖులపై కేసులు నమోదయ్యాయి. వరుస పరిణామాల దృష్ట్యా రేవ్‌ పార్టీని హైదరాబాద్‌లో కాకుండా బెంగళూరులో నిర్వహించినట్లు నగర పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రూ.50 లక్షల వ్యయంతో ఈ పార్టీ నిర్వహించిన వాసు నేపథ్యం, అతడి సంబంధాలపై దృష్టి సారించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని