logo

కోడ్‌ ముగిసిన వెంటనే కొత్త ఎస్టీపీలకు టెండర్లు

ఔటర్‌ పరిధిలో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీలు) నిర్మాణానికి జలమండలి ప్రణాళిక రంగం సిద్ధం చేసింది.

Updated : 21 May 2024 05:11 IST

795 ఎంఎల్‌డీ సామర్థ్యంతో 38 ఎస్టీపీలు
అవుటర్‌ వరకు మురుగు శుద్ధికి ప్రణాళిక

ఈనాడు, హైదరాబాద్‌: ఔటర్‌ పరిధిలో కొత్తగా మురుగునీటి శుద్ధి కేంద్రాల(ఎస్టీపీలు) నిర్మాణానికి జలమండలి ప్రణాళిక రంగం సిద్ధం చేసింది. అవుటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలో మొత్తం 795 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో 38 ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే పూర్తి ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను జలమండలి సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. ఎన్నికల కోడ్‌ ముగిసిన వెంటనే ఈ కొత్త ఎస్టీపీల కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఓ ఉన్నతాధికారి తెలిపారు. హైబ్రిడ్‌ యాన్యునిటీ పద్ధతిలో ఈ కొత్త ఎస్టీపీలు నిర్మించనున్నారు. ఈ విధానంలో జలమండలి 40 శాతం, గుత్తేదారు సంస్థ 60 శాతం నిధులు వెచ్చిస్తాయి. పనులు పూర్తి చేసిన తర్వాత గుత్తేదారు పెట్టిన మొత్తాన్ని వాయిదాల పద్ధతిలో తిరిగి జలమండలి చెల్లించనుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ.3849 కోట్లు అవసరమని అంచనా. భూ సేకరణకు ఇబ్బంది లేకుండా చిన్న చిన్న కేంద్రాలను ఎక్కువ ప్రాంతాల్లో నిర్మించనున్నారు. ప్రస్తుతం గ్రేటర్‌వ్యాప్తంగా ఉన్న ఎస్టీపీల ద్వారా 750 మిలియన్‌ లీటర్ల మురుగు శుద్ధి చేస్తున్నారు. ఇవి కాకుండా నగరవ్యాప్తంగా 31 ఎస్టీపీలు సిద్ధమవుతున్నాయి. అందులో కొన్ని ప్రారంభించగా...జులై నాటికి అన్ని ఎస్టీపీల్లో మురుగుశుద్ధి ప్రారంభం కానుంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని