logo

బోటు షికారు.. పోటెత్తిన హుషారు

అసలే వేసవి సెలవులు.. అందులోనూ వాతావరణం చల్లగా మారి నాలుగైదు రోజులుగా చినుకులు పలకరిస్తున్నాయి.

Published : 21 May 2024 01:43 IST

ఈనాడు, హైదరాబాద్‌: అసలే వేసవి సెలవులు.. అందులోనూ వాతావరణం చల్లగా మారి నాలుగైదు రోజులుగా చినుకులు పలకరిస్తున్నాయి. దీంతో నగరానికి పర్యాటకులు పోటెత్తడంతో సాగర తీరంలో సందర్శకుల తాకిడి బాగా పెరిగింది. కరోనా తర్వాత రికార్డు స్థాయిలో సందర్శకులు బోటు షికారు చేశారని లుంబినీ బోటింగ్‌ యూనిట్‌ మేనేజర్‌ జి.ప్రభుదాస్‌ పేర్కొన్నారు. శనివారం 10 వేల మంది బోటు షికారు చేయగా ఆదివారం ఆ సంఖ్య 13 వేలకు చేరింది. శనివారం 10,200 మంది, ఆదివారం ఏకంగా 13,350 మంది బోటు షికారు చేయడంతో గత రికార్డులన్నీ బద్దలకొట్టాయి. శనివారం రూ.9లక్షలకు పైగా ఆదాయం రాగా ఆదివారం రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్‌ తెలిపారు. కరోనా తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు