logo

తాగునీటికి ఆరాటం.. ప్రాణాలతో చెలగాటం

తాగునీటి కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. బాలానగర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌లోని నాలాను ఆనుకొని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి.

Published : 21 May 2024 01:48 IST

కూకట్‌పల్లి: తాగునీటి కోసం ప్రాణాలతో చెలగాటమాడుతున్న పరిస్థితులకు ఈ చిత్రాలు అద్దం పడుతున్నాయి. బాలానగర్‌ డివిజన్‌ రాజీవ్‌గాంధీనగర్‌లోని నాలాను ఆనుకొని కొన్ని కుటుంబాలు నివసిస్తున్నాయి. వీరు నాలా అవతల బస్తీలో ఉన్న మంజీరా పైపులైన్‌ నుంచి తాగునీటి కనెక్షన్లు తీసుకున్నారు. ఈ పైపులు నాలా పైనుంచి వేలాడుతూ ఇవతలి వైపున్న నివాసితుల ఇళ్లకు చేరుతాయి. వర్షం పడినప్పుడు ఈ పైపుల జాయింట్లు ఊడిపోతుండడం.. స్థానికులు నాలాలోకి దిగి.. వాటిని తాళ్లతో కట్టడం, పరిపాటి. ఆదివారం కురిసిన భారీ వర్షం కారణంగా వరద ఉద్ధృతికి పైపులు ఊడిపోవడంతో చేసేదేమీలేక స్థానికులు ప్రాణాలను పణంగా పెట్టి నాలాలో దిగి పైపులను సరిచేశారు. ఈ విషయాన్ని ‘ఈనాడు’ జలమండలి డీజీఎం వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన సోమవారం పరిశీలించి ఐదు కనెక్షన్లు ఇలా ఉన్నాయని.. వాటి బిల్లులు కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని