logo

అనుమతి అడిగితే.. డబ్బులడిగారు!

కూల్చిన ప్రహరీ, గదిని పునర్నిర్మించుకోవడానికి ఓ వ్యక్తి అనుమతి కోరగా అతడి నుంచి లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కారోబార్‌లు అనిశా వలకు చిక్కారు.

Updated : 21 May 2024 05:16 IST

 

శంషాబాద్‌: కూల్చిన ప్రహరీ, గదిని పునర్నిర్మించుకోవడానికి ఓ వ్యక్తి అనుమతి కోరగా అతడి నుంచి లంచం తీసుకుంటూ పంచాయతీ కార్యదర్శి, కారోబార్‌లు అనిశా వలకు చిక్కారు. అనిశా అధికారుల వివరాల ప్రకారం.. శంషాబాద్‌ పరిధి రాళ్లగూడకు చెందిన ఎం.రాధికారెడ్డి నానాజీపూర్‌ పంచాయతీ కార్యదర్శిగా, పాలమాకులకు చెందిన బాలరాజ్‌ కారోబార్‌గా పనిచేస్తున్నారు.నగరానికి చెందిన బర్కత్‌అలీ నానాజీపూర్‌లో ఓ ఇంటి స్థలం కొని ఇటీవల ప్రహరీ నిర్మించగా అనుమతి లేదని పంచాయతీ అధికారులు కూల్చివేశారు. దీంతో అనుమతి కోసం పంచాయతీ కార్యదర్శి రాధికారెడ్డిని, కారోబార్‌ బాలరాజ్‌లను బర్కత్‌ అలీ సంప్రదించారు. దానికి వారు రూ.60 వేలు లంచం డిమాండ్‌ చేయగా.రూ.35వేలకు అంగీకరించారు. అనంతరం బర్కత్‌అలీ అనిశాను ఆశ్రయించారు. సోమవారం పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి, కారోబార్‌లకు రూ.35 వేలు ఇస్తుండగా అనిశా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పంచాయతీ కార్యాలయం, కార్యదర్శి నివాసంలో అధికారులు సోదాలు చేసి పలు దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరినీ అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ అదనపు ప్రత్యేక జడ్జి ఎదుట హాజరుపరిచారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని