logo

ఉపాధ్యాయుల నియామకంలో నైపుణ్యం ముఖ్యం

ప్రైవేటు పాఠశాలల్లో బోధనా సిబ్బంది నియామకంలో ప్రధానంగా చూడాల్సింది వారి అకడమిక్‌ అర్హతలు కాదని.. వివిధ అంశాల్లో వారికున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ)

Published : 22 May 2024 02:41 IST

మాట్లాడుతున్న  సీఐఎస్‌సీఈ సీఈఓ జోసెఫ్‌ ఇమ్మాన్యుయెల్‌. చిత్రంలో ఛైర్మన్‌ ఇమ్మాన్యుయెల్, డిప్యూటీ సెక్రెటరీ సంగీతా భాటియా

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: ప్రైవేటు పాఠశాలల్లో బోధనా సిబ్బంది నియామకంలో ప్రధానంగా చూడాల్సింది వారి అకడమిక్‌ అర్హతలు కాదని.. వివిధ అంశాల్లో వారికున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకోవాలని కౌన్సిల్‌ ఫర్‌ ది ఇండియన్‌ స్కూల్‌ సర్టిఫికెట్‌ ఎగ్జామినేషన్స్‌ (సీఐఎస్‌సీఈ) చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ అండ్‌ సెక్రెటరీ (సీఈఎస్‌) జోసెఫ్‌ ఇమ్మాన్యుయెల్‌ పేర్కొన్నారు. హబ్సిగూడలోని సీఐఎస్‌సీఈ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో నూతన జాతీయ విద్యావిధానం అమలు తీరుపై మంగళవారం సమావేశం నిర్వహించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని సీఐఎస్‌సీఈ అనుబంధ పాఠశాలల ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ్య ప్రణాళిక పక్కాగా ఉండాలని, విద్యార్థులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలన్నారు. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కంప్యూటర్‌ అందుబాటులో ఉండాలన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లోని ప్రైవేటు పాఠశాలలకు మనకు ప్రధానమైన తేడా వారు పాఠ్య ప్రణాళికను కచ్చితంగా అమలు చేస్తున్నారన్నారు. అక్కడ మెరుగైన ఫలితాలు రావడానికి ఇదే ప్రధాన కారణమన్నారు. విద్యార్థులకు పరీక్షలపై ఉండే భయాన్ని పోగొట్టాలన్నారు. జాతీయ నూతన విద్యావిధానం ఆధారంగా ప్రైవేటు ఉపాధ్యాయులకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ కార్యక్రమాలు ప్రారంభిస్తామన్నారు. సమావేశంలో సీఐఎస్‌సీఈ ఛైర్మన్‌ ఇమ్మాన్యుయెల్, డిప్యూటీ సెక్రెటరీ సంగీతా భాటియా పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని