logo

‘లక్ష్య’ అథ్లెట్లకు పుల్లెల గోపీచంద్‌ అభినందనలు

ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లను భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభినందించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన బ్యాట్‌(బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు.

Published : 22 May 2024 02:44 IST

ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లతో గోపీచంద్‌

వరంగల్‌ క్రీడావిభాగం, న్యూస్‌టుడే: ఈనాడు ‘లక్ష్య’ అథ్లెట్లను భారత బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అభినందించారు. మంగళవారం హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగిన బ్యాట్‌(బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ తెలంగాణ) రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ఆయన హాజరయ్యారు. హనుమకొండ జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ఈనాడు ‘లక్ష్య’ అథ్లెటిక్స్‌ శిక్షణ కేంద్రానికి చెందిన క్రీడాకారులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల సూర్యాపేట జిల్లాలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులు కైఫ్, శ్రీధర్, రవితేజ, కోచ్‌ నాగరాజును, జాతీయస్థాయిలో పాల్గొన్న అథ్లెట్లను గోపిచంద్‌ ప్రత్యేకంగా అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలంటే నిరంతరం సాధన చేయాలని సూచించారు. కార్యక్రమంలో అథ్లెట్లు కార్తిక్, మహేష్, శ్రావణ్, ఎం.మహేష్‌ పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని