logo

నల్సార్‌లో సెంటర్‌ ఫర్‌ ఆర్బిట్రేషన్‌ లా ఏర్పాటుకు ఎంఓయూ

నల్సార్‌ యూనివర్సిటీలో మిలన్‌ కె.బెనర్జీ ‘సెంటర్‌ ఫర్‌ ఆర్బిట్రేషన్‌ లా’ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ బెనర్జీ వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.కృష్ణదేవరావుతో దిల్లీలో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

Published : 22 May 2024 02:51 IST

పత్రాలు మార్చుకున్న గౌరవ్‌ బెనర్జీ, కృష్ణదేవరావు 

ఈనాడు, హైదరాబాద్‌: నల్సార్‌ యూనివర్సిటీలో మిలన్‌ కె.బెనర్జీ ‘సెంటర్‌ ఫర్‌ ఆర్బిట్రేషన్‌ లా’ ఏర్పాటుకు సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది గౌరవ్‌ బెనర్జీ వర్సిటీ వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి.కృష్ణదేవరావుతో దిల్లీలో ఇటీవల అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆర్బిట్రేషన్‌ అమలుకు సంబంధించి న్యాయవిద్యార్థులు, న్యాయవాదులు, విధాన రూపకర్తలు ఆలోచనలను పంచుకోవడానికి, పరిశోధనలకు ఈ కేంద్రం చేయూతనివ్వనుంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ రోహిన్‌టన్‌ ఫాలి నారిమన్‌ కేంద్రానికి ఛైర్మన్‌గా, సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రితిన్‌ రాయ్‌ వైస్‌ఛైర్మన్‌గా, నల్సార్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ అమిత్‌ జార్జ్, శ్రేయ ఫారిఖ్, చంద్‌ చొప్రాలు బోర్డులో కొనసాగనున్నారు. ఆర్బిట్రేషన్‌పై జరిగే కార్యక్రమాల్లో తమ సెంటరు ముందుంటుందని నల్సార్‌ వీసీ వి.కృష్ణదేవరావు పేర్కొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని