logo

రవీంద్రభారతిలో 20కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం

సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల నాటి అరుదైన వృక్ష శిలాజం రవీంద్రభారతి ప్రాంగణంలో కొలువుదీరాయి. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్‌ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీనిని కనుగొన్నారు.

Updated : 22 May 2024 04:03 IST

రవీంద్రభారతి: సుమారు ఇరవై కోట్ల సంవత్సరాల నాటి అరుదైన వృక్ష శిలాజం రవీంద్రభారతి ప్రాంగణంలో కొలువుదీరాయి. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్‌ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీనిని కనుగొన్నారు. జురాసిక్, క్రిటిసియస్‌ కాలానికి చెందిన ఈ శిలాజం నాటి జీవ పరిణామ క్రమంలోని అనేక అంశాలకు సాక్ష్యాలుగా నిలుస్తాయని సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ తెలిపారు. రవీంద్రభారతి కారిడార్‌లోని రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ విగ్రహానికి ఇరువైపులా ఈ శిలాజాలను ప్రత్యేక పెట్టెలో ఎర్రటి మట్టి వేసి ఏర్పాటు చేశామని, సందర్శకులు తాకకుండా అద్దంతో డోమ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని