logo

నైజీరియా నుంచే ఫోన్‌

రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు నైజీరియాలో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. ఇదే నంబర్‌తో ఇంకా ఎవరికైనా ఫోన్లు వెళ్లాయా అన్నదానిపైనా అధికారులు దృష్టి సారించారు.

Updated : 22 May 2024 04:05 IST

డీజీపీ డీపీతో బెదిరింపుల కేసులో పురోగతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఫొటోను వాట్సప్‌ డీపీగా పెట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డ నిందితుడు నైజీరియాలో ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడయింది. ఇదే నంబర్‌తో ఇంకా ఎవరికైనా ఫోన్లు వెళ్లాయా అన్నదానిపైనా అధికారులు దృష్టి సారించారు. ‘మీ కుమార్తె మాదకద్రవ్యాల కేసులో ఇరుక్కుంది. అరెస్టు కాకుండా ఉండాలంటే రూ.50వేలు ఇవ్వాలి’ అని నగరానికి చెందిన ఒక వ్యాపారవేత్తకు ఈ నెల 18న నిందితుడు వాట్సప్‌ కాల్‌ చేశాడు. డీపీ.. డీజీపీ రవిగుప్తాది కావడంతో వ్యాపారి సైబర్‌ సెక్యూరిటీ బ్యూరోకి ఫిర్యాదు చేశారు. అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. పాకిస్థాన్‌ ఐ.ఎస్‌.డి. కోడ్‌ 92తో వ్యాపారవేత్తకు ఫోన్‌ వచ్చింది. వాస్తవానికి అది ఎక్కడ నుంచి వచ్చిందన్నది తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పాకిస్థాన్‌ కోడ్‌తో వచ్చినా ఫోన్‌ చేసింది నైజీరియా నుంచే అని నిర్ధారణకు వచ్చారు. నైజీరియా నుంచి గతంలోనూ ఇలాంటి కాల్స్‌ వచ్చినట్లు గుర్తించారు. ఒక్కరు మాత్రమే ఫిర్యాదు చేయగా ఇదే నేరగాడు ఇంకా ఎవర్నైనా ఇలానే బెదిరించి డబ్బు గుంజాడా అన్న అంశంపైనా ఆరా తీస్తున్నారు. కొద్దిరోజుల క్రితం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి డీపీ పెట్టుకొని ఒక నేరగాడు ఇద్దరు అధికారులను డబ్బులు డిమాండు చేసిన ఉదంతం తెలిసిందే. దానిపై హైదరాబాద్‌ సైబర్‌క్రైంస్టేషన్లో కేసు నమోదైంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని