logo

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో ఈడబ్ల్యూబీజీ ప్రొఫెసర్‌ భేటీ

యూరోపియన్‌ వెల్నెస్‌ బయోమెడికల్‌ గ్రూప్‌(ఈడబ్ల్యూబీజీ) ప్రొఫెసర్‌ డా.మైక్‌చాన్‌ మంగళవారం గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. స్టెమ్‌ సెల్‌ థెరపీ విధానంలో వచ్చిన మార్పులు, జరుగుతున్న పరిశోధనలపై వారితో చర్చించారు.

Published : 22 May 2024 03:01 IST

ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో మైక్‌చాన్‌

గచ్చిబౌలి, న్యూస్‌టుడే: యూరోపియన్‌ వెల్నెస్‌ బయోమెడికల్‌ గ్రూప్‌(ఈడబ్ల్యూబీజీ) ప్రొఫెసర్‌ డా.మైక్‌చాన్‌ మంగళవారం గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ విద్యార్థులతో భేటీ అయ్యారు. స్టెమ్‌ సెల్‌ థెరపీ విధానంలో వచ్చిన మార్పులు, జరుగుతున్న పరిశోధనలపై వారితో చర్చించారు. ఈ సందర్భంగా విద్యార్థులడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు. యూరోపియన్‌ వెల్నెస్‌ పరిశోధన నుంచి ఉద్భవించిన ఆవిష్కరణలను వివరించారు. ఈ విధానంలో.. ప్రతి రోగికి సంబంధించిన వైద్యచరిత్రను పరిగణించి వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా చికిత్స ప్రణాళికలను రూపొందిస్తారన్నారు. సమీకృత ఆరోగ్యం, వెల్నెస్‌లో గ్లోబల్‌ లీడర్‌గా ఉన్న యూరోపియన్‌ వెల్నెస్‌ భారత్‌లోకి ప్రవేశించడం హర్షనీయమన్నారు. ఆరోగ్య సంరక్షణ కోసం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి అత్యాధునిక చికిత్సలు అందించడానికి ఈ సంస్థ సిద్ధంగా ఉందన్నారు. సంస్థ సీఈవో ప్రొఫెసర్‌ డా.రవితేజ అల్లం మాట్లాడుతూ.. వినూత్నమైన వెల్నెస్‌ పరిష్కారాలను భారత్‌కు తీసుకువస్తున్నామని వివరించారు. ఈడబ్ల్యూబీజీ ప్రొఫెసర్‌ ఓహ్లో నిష్కుమై, సినీ నిర్మాత ఎ.ఎం.రత్నం, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టిసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు