logo

సైబర్‌ మోసం..యువకుల అప్రమత్తం

బషీరాబాద్‌ మండలం వాల్యానాయక్‌ తండాకు చెందిన సిద్దునాయక్, అదే తండాకు చెందిన మరో యువకుడు ఇటుకల వ్యాపారం చేస్తారు. మంతట్టి రైల్వే స్టేషన్‌ పనుల గుత్తేదారు కింద పనిచేసే సహాయకుడు ఇటీవల ట్రాక్టర్‌ ఇటుకలు కావాలని కోరగా రూ.23,500కు మాట్లాడుకున్నారు.

Published : 22 May 2024 03:04 IST

మోసాన్ని వివరిస్తున్న యువకులు

బషీరాబాద్, న్యూస్‌టుడే: బషీరాబాద్‌ మండలం వాల్యానాయక్‌ తండాకు చెందిన సిద్దునాయక్, అదే తండాకు చెందిన మరో యువకుడు ఇటుకల వ్యాపారం చేస్తారు. మంతట్టి రైల్వే స్టేషన్‌ పనుల గుత్తేదారు కింద పనిచేసే సహాయకుడు ఇటీవల ట్రాక్టర్‌ ఇటుకలు కావాలని కోరగా రూ.23,500కు మాట్లాడుకున్నారు. ఇటుకలను ట్రాక్టర్‌లో తీసుకొని మంగళవారం పని ప్రదేశం వద్దకు వెళ్లారు. లోడు దించేందుకు, ఒప్పందం మేరకు డబ్బు తీసుకోవడానికి అక్కడున్న కూలీలతో డబ్బు గురించి ప్రస్తావించగా ‘మా సార్‌’తో మాట్లాడమని ఒక ఫోన్‌ నం.ఇచ్చారు. దానికి ఫోన్‌ చేస్తే..ముందుగా మీరు రూ.23,500లు కట్టండి. తరువాత మీరు పంపిన నగదు, ఇటుక తాలూకు నగదు కలిపి వేస్తామని హిందీలో చెప్పారు. దీంతో ముందుగా సిద్దు రూ.1000 ఫోన్‌ పే చేశాడు. మరోసారి రూ.2వేలు మొత్తం రూ.3వేలు పంపించాడు. మిగతా రూ.20,500 పంపాలని చూసినా నెట్‌వర్క్‌ లేక నగదు ట్రాన్స్‌ఫర్‌ కాలేదు. మిగతా మొత్తం నగదు పంపితేనే ఇటుకలు తీసుకుంటామని చెప్పడంతో మోసపోతున్నామని గ్రహించిన యువకులు ఫోన్‌ నం.1930కు ఫిర్యాదుచేశారు. ఇటుకలను వెనక్కు తెచ్చేశారు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని