logo

డీఈవోకు తాఖీదులు

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తుల పురోగతిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న విద్యాశాఖాధికారులపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 22 May 2024 03:17 IST

విధుల్లో నిర్లక్ష్యంపై కలెక్టర్‌ ఆగ్రహం
స్వయంగా ప్రభుత్వ పాఠశాలల పరిశీలన

కాచిగూడ తులసీరాం నగర్‌ పాఠశాలలో..

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు అందజేయాల్సిన ఏకరూప దుస్తుల పురోగతిపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న విద్యాశాఖాధికారులపై కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఈఓ రోహిణికి తాఖీదులు జారీ చేశారు. ఇన్‌ఛార్జి డీఈవో బి.శ్రీనివాస్, బహదూర్‌పుర డిప్యూటీ డీఈవోలకూ తాఖీదులు జారీ చేయాలని ఆదేశించారు. బుధవారం మలక్‌పేట, మాదన్నపేట, సైదాబాద్, కోఠి, సుల్తాన్‌బజార్, కాచిగూడ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లారు. పాఠశాలల ఆవరణలో చెత్తాచెదారం, ఇనుప సామగ్రి, రేకులు, విరిగిన కుర్చీలు, తలుపులు, కిటికీలు, నిర్మాణ వ్యర్థాలు ఉండడాన్ని గమనించారు. శుభ్రం చేయించాలని ఆదేశించారు. తరగతి గదుల్లో ఫ్యాన్లు, విద్యుద్దీపాలకు మరమ్మతులు చేయించాలని, లేదా కొత్తవాటిని ఏర్పాటు చేయాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించండి: రాజ్‌భవన్‌ పాఠశాల తరహాలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, డిజిటల్‌ క్లాస్‌రూంలు అందుబాటులోకి తేవాలన్నారు. ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలలకు దీటుగా తీర్చిదిద్ది తల్లిదండ్రులకు చూపించి పిల్లలను చేర్పించేలా ప్రచారం చేయాలన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని