logo

నిర్లక్ష్యం.. తప్పదు మూల్యం

శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడినట్లే. ఒకసారి  హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానా రూ.135 (సర్‌ఛార్జీలతో కలిపి).

Published : 22 May 2024 03:19 IST

ట్రాఫిక్‌ చలానాలతో జేబుకు చిల్లు
అవగాహన అవసరమంటున్న పోలీసులు

నారాయణగూడ, న్యూస్‌టుడే: శిరస్త్రాణం లేకుండా ద్విచక్రవాహనంపై ప్రయాణిస్తున్నారా.. అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడినట్లే. ఒకసారి  హెల్మెట్‌ ధరించకుండా వాహనం నడిపితే ట్రాఫిక్‌ పోలీసులు విధించే జరిమానా రూ.135 (సర్‌ఛార్జీలతో కలిపి). ఈ మొత్తం చెల్లించకుండా పెండింగ్‌లో పడితే రెండో చలానా రూ.235 అవుతుంది. అప్పుడూ చెల్లించకపోతే మూడోసారి ఏకంగా రూ.635 వస్తుంది. ఇది మూడు చలాన్లు కలిపి వచ్చిందనుకుంటే తప్పులో కాలేసినట్లే. మూడూ కలిపి రూ.1,005 చెల్లించాల్సి వస్తుంది. 

నంబరు ప్లేట్‌ సరిగా లేకపోతే..

చలాన్ల నుంచి తప్పించుకోవడానికి చాలా మంది నంబరు పేటుపై అంకెలు కనిపించకుండా చేయడం, వంచడం, మాస్క్‌ అడ్డుగా ఉంచడం, మహిళలు వెనక కూర్చునప్పుడు చున్నీతో కప్పివేయడం వంటివి చేస్తుంటారు. అయితే ముందున్న నంబరు ప్లేట్‌పై క్లిక్‌మనిపిస్తారు. వెనుక ఉన్న నంబరును ఎలా దాచిపెట్టారో సైతం ఫోటో తీసి.. సాధారణంగా విధించే రూ.135 బదులు ఉద్దేశ్యపూర్వకంగా చేసిన నేరంగా పరిగణిస్తూ రూ.500 పైన చలానా విధిస్తారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని