logo

గాడి తప్పిన నగర సీసీఎస్‌

నగర సీసీఎస్‌.. కీలక ఆర్థిక నేరాల కేసులను ఛేదించటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం గాడి తప్పింది. తాజాగా సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో, మరికొన్ని చోట్ల దాడులు నిర్వహించగా భారీఎత్తున నోట్లకట్టలు,

Published : 22 May 2024 05:53 IST

కాసులు చేతిలో పడితేనే కేసుల నమోదు

ఈనాడు, హైదరాబాద్‌: నగర సీసీఎస్‌.. కీలక ఆర్థిక నేరాల కేసులను ఛేదించటంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం గాడి తప్పింది. తాజాగా సీసీఎస్‌ ఏసీపీ ఉమామహేశ్వరరావు నివాసంలో, మరికొన్ని చోట్ల దాడులు నిర్వహించగా భారీఎత్తున నోట్లకట్టలు, విలువైన పత్రాలు బయటపడటమే ఇందుకు నిదర్శనం. దీంతో ఇప్పటి వరకూ నమోదైన కేసుల దర్యాప్తు విధానంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో ఇద్దరు ఏసీపీలు, నలుగురు ఇన్‌స్పెక్టర్లపై వచ్చిన ఫిర్యాదులతో ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. 

ఏటా వేలకోట్లు.. రికవరీలో కునికిపాట్లు: రూ.9,765 కోట్లు.. గతేడాది వాణిజ్య బ్యాంకులు, ఫైనాన్స్‌ సంస్థలు, స్టాక్‌మార్కెట్, బహుమతులు, అధికవడ్డీలు, భూ కుంభకోణాలు తదితర ఆర్థిక నేరాలతో నగర ప్రజలు నష్టపోయిన సొమ్ము. 2022లో సుమారు రూ.12వేల కోట్ల వరకూ పోగొట్టుకున్నారు. సాహితీ ఇన్‌ఫ్రా సంస్థ పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను ఆసరా చేసుకొని ప్రీలాంచింగ్‌ పేరిట రూ.2 వేల కోట్లు వసూలు చేసి ముఖం చాటేసింది. రెండేళ్లుగా బాధితులు సీసీఎస్‌ చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. నిందితులతో జతకట్టిన కొందరు అధికారులు కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా చూస్తున్నారంటూ బాధితులు వాపోయారు. రూ.75 లక్షలకుపైగా జరిగే ఆర్థిక నేరాలు/మోసాల కేసుల దర్యాప్తు సీసీఎస్‌ చేపడుతుంది. అయితే కాసులకు కక్కుర్తిపడి బాధితులనే బెదిరించడం మొదలుపెట్టారు. నిందితులకు సహకరిస్తూ లాభపడుతున్నట్లు తెలుస్తోంది. ఉన్నఫళంగా సీసీఎస్‌ను ప్రక్షాళన చేయకపోతే ప్రతిష్ఠ మసకబారుతుందని ఉన్నతాధికారులంటున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు