logo

ఆదాయం 2.. ఖర్చు 5

నగరవాసుల సంపాదన ఎలా ఉంది? వచ్చిన ఆదాయంలో దేని కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలపై హోమ్‌ క్రెడిట్‌ ఇండియా దేశవ్యాప్తంగా 17 నగరాల్లో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌’ పేరుతో అధ్యయనం చేసింది

Published : 23 May 2024 06:53 IST

ఇంటి అద్దె, పిల్లల చదువుల కోసమే భారీగా వ్యయం 

అయినా ఆదాయం పెరుగుతుందన్న ఆశాభావంతో నగరవాసులు 
హోమ్‌ క్రెడిట్‌ ఇండియా సర్వేలో వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌ : నగరవాసుల సంపాదన ఎలా ఉంది? వచ్చిన ఆదాయంలో దేని కోసం ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు? తదితర విషయాలపై హోమ్‌ క్రెడిట్‌ ఇండియా దేశవ్యాప్తంగా 17 నగరాల్లో ‘ది గ్రేట్‌ ఇండియన్‌ వాలెట్‌’ పేరుతో అధ్యయనం చేసింది. వీరి పరిశీలనలో హైదరాబాద్‌లో తేలిన అంశాలు ఏంటంటే? 

  • సర్వేలో పాల్గొన్న వారిలో 2023లో నెలవారీ సగటు ఆదాయం రూ.42వేల నుంచి 44వేలకు పెరిగిందని తెలిపారు. 
  • ఆదాయం పెరుగుదల కంటే ఖర్చుల వ్యయం అధికంగా ఉంది. 2023లో ఖర్చులు రూ.19వేల నుంచి 24వేలకు పెరిగినట్లు వెల్లడించారు. 
  • ఇంటి అద్దె, కిరాణ సరకుల కోసం ఆదాయంలో 21 శాతం, పిల్లల చదువుల కోసం 17 శాతం ఖర్చు అవుతున్నట్లు చెప్పారు. ః విచక్షణ మేరకు చేసే ఖర్చులో ప్రయాణం/సందర్శనల కోసం ఆదాయంలో అత్యధికంగా 35 శాతం ఖర్చు చేస్తున్నారు. 
  •  జీహ్వా రుచి కోసం ఆదాయంలో 28 శాతం ఖర్చు చేస్తున్నారు. 
  • సినిమాల కోసం 19 శాతం, ఓటీటీ వినోదం కోసం 10 శాతం వెచ్చిస్తున్నారు. 
  • ఫిట్‌నెస్‌ను విస్మరించలేమని చెబుతున్నవారు అందుకోసం 6 శాతం దాకా ఖర్చవుతుందని అంటున్నారు. 

ఆన్‌లైన్‌తో అప్రమత్తంగా.. 

 41 శాతం మంది ఆన్‌లైన్‌ ఆర్థిక మోసాల గురించి విన్నామని, 27 శాతం మంది ఆన్‌లైన్‌ మోసాలకు గురయ్యామని చెప్పారు.  ః ప్రస్తుతం యూపీఐ సేవలను ఉచితంగా అందిస్తున్నారని.. వీటికి ఛార్జీలు వసూలు చేస్తే ఆపేస్తామని 64 శాతం మంది అభిప్రాయపడ్డారు. ః  రాబోయే సంవత్సరాల్లో ఆదాయం పెరుగుతుందన్న వారి శాతం 74 శాతంగా ఉంది. ః 66 శాతం మంది పొదుపు చేయగలగుతున్నామని చెప్పారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని