logo

ప్రయాణికులను వదిలేసి వెళ్లిన విమానం

ఓ విమాన సర్వీస్‌ నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది.

Published : 23 May 2024 04:23 IST

శంషాబాద్, న్యూస్‌టుడే: ఓ విమాన సర్వీస్‌ నలుగురు ప్రయాణికులను వదిలేసి వెళ్లిపోయిన ఘటన శంషాబాద్‌ విమానాశ్రయంలో బుధవారం చోటుచేసుకుంది. సకాలంలో విమానాశ్రయానికి చేరుకుని అన్ని తనిఖీలు చేయించుకున్న తరువాత వదిలేసి వెళ్లిపోయారంటూ వారు ఆందోళనకు దిగారు. భద్రతాధికారులు జోక్యం చేసుకుని వారికి సర్దిచెప్పారు. హైదరాబాద్‌కు చెందిన ముదుగుల సురేష్, జమాల్‌పూర్‌ ఆనంద్, ఘన్‌శ్యాం, మరో వ్యక్తితో కలిసి ఓ ఎయిర్‌లైన్స్‌లో బుధవారం ఉదయం 10.45 గంటలకు వారణాసికి వెళ్లడానికి టికెట్లు కొనుగోలు చేశారు. ఉదయం 10 గంటలకల్లా విమానాశ్రయానికి చేరుకుని అన్ని తనిఖీలు చేసుకుని బోర్డింగ్‌ పాస్‌లు తీసుకున్నారు. తరువాత విమానం ఎక్కడానికి వెళుతుండగా ఆలస్యంగా వచ్చారంటూ ఎయిర్‌లైన్స్‌ సిబ్బంది అడ్డుకున్నారు. ఎయిర్‌లైన్స్‌ నిర్వాకంతో రూ.30వేలు నష్టపోయామన్నారు. మోసాలకు పాల్పడుతున్న సదరు ఎయిర్‌లైన్స్‌పై వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేస్తామని ప్రయాణికులు చెప్పారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని