logo

కిడ్నాప్‌ కథ అల్లి.. తల్లీబిడ్డలు మాయం

వాహనాల రద్దీ నడుమ వెళ్తున్న ఓ ఆటోలో నుంచి ‘‘కిడ్నాప్‌ చేస్తున్నాడు బచావ్‌.. బచావ్‌’’ అంటూ ఓ మహిళ కేకలతో ఉలిక్కిపడిన వాహన చోదకులు సదరు ఆటో డ్రైవర్‌ను పట్టుకుని చితక బాదారు

Published : 23 May 2024 04:24 IST

ఆటో నడుపుతున్న భర్తను చితక బాదిన వాహన చోదకులు

ఖైరతాబాద్, న్యూస్‌టుడే: వాహనాల రద్దీ నడుమ వెళ్తున్న ఓ ఆటోలో నుంచి ‘‘కిడ్నాప్‌ చేస్తున్నాడు బచావ్‌.. బచావ్‌’’ అంటూ ఓ మహిళ కేకలతో ఉలిక్కిపడిన వాహన చోదకులు సదరు ఆటో డ్రైవర్‌ను పట్టుకుని చితక బాదారు. ఈ అలజడిలో ఆటోలో ఉన్న తల్లీ కూతుళ్లు దారిలో వెళ్తున్న మరో ఆటో ఎక్కి మాయమయ్యారు. ఈ సంఘటన మంగళవారం రాత్రి ఖైరతాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్‌కు చెందిన ఓ మహిళ 14 ఏళ్ల కిందట ఓ వ్యక్తిని వివాహం చేసుకుని ఆయేషాబేగం (35)గా పేరు మార్చుకుంది. వారికి 12 ఏళ్ల కూతురు సమ్రీన్‌ ఉంది. విభేదాలతో భర్తకు విడాకులు ఇచ్చి శంషాబాద్‌ ప్రాంతానికి చెందిన ఆటో డ్రైవర్‌ మహ్మద్‌ నవాజ్‌ను 11 నెలల కిందట వివాహం చేసుకుంది. అప్పట్నుంచి బంజారాహిల్స్‌లో కలిసి ఉంటున్న వీరిని మహ్మద్‌ నవాజ్‌ మంగళవారం శంషాబాద్‌లోని తన తల్లి వద్దకు ఆటోలో తీసుకెళ్తున్నాడు. రాత్రి 8 గంటల సమయంలో ఆటో ఖైరతాబాద్‌ ఫ్లైఓవర్‌ మీదకు చేరుకోగానే ఆటోలో ఉన్న ఆయేషాబేగం తనను కిడ్నాప్‌ చేస్తున్నాడు.. రక్షించండని కేకలు వేసింది. రోడ్డున వెళ్తున్న ఇతర వాహనచోదకులు ఆటోను అడ్డుకుని ఆటో నడుపుతున్న వ్యక్తిని చితక్కొట్టారు. అ సమయంలో తాను ఆమె భర్తనని చెప్పినా వినిపించుకోలేదు. ఈ తతంగం జరుగుతున్న క్రమంలో ఆటోలో నుంచి కేకలు వేసిన తల్లీ కూతుళ్లు మరో ఆటో ఎక్కి సచి వెళ్లిపోయారు. వారి ఆచూకీ తెలియక నేరుగా జరిగిన ఘటనను వివరిస్తూ ఖైరతాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని