logo

ఏపీ హైకోర్టు జస్టిస్‌ పేరుతో పోలీసులకు వేధింపులు.. అరెస్టు

ఏపీ హైకోర్టు జస్టిస్‌ తనకు సోదరి అని చెప్పి ఓ మహిళకు వీసా ఇప్పిస్తానని నమ్మబలికాడు. మగ గొంతు ఆడ గొంతుగా మారే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు.

Updated : 23 May 2024 08:37 IST

సందీప్‌ 

కేపీహెచ్‌బీకాలనీ: ఏపీ హైకోర్టు జస్టిస్‌ తనకు సోదరి అని చెప్పి ఓ మహిళకు వీసా ఇప్పిస్తానని నమ్మబలికాడు. మగ గొంతు ఆడ గొంతుగా మారే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. పోలీసులకు తరచూ ఫోన్లు చేస్తూ.. తాను జస్టిస్‌నని చెప్తూ వేధించేవాడు. చివరకు సూడో జడ్జి అని తెలుసుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు ఆ కేటుగాన్ని రిమాండ్‌కు తరలించారు. ఎస్‌హెచ్‌వో వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం.. కృష్ణా జిల్లా మొవ్వ మండలం భట్లపెనుమర్రుకి చెందిన గొట్టిపాటి సందీప్‌(23) డిప్లొమో చేశాడు. కేపీహెచ్‌బీకి చెందిన ఓ మహిళ విదేశాల్లో వీసా కోసం  దళారులకు నగదు ఇచ్చి మోసపోయింది.   ఆ వివరాలు తెలుసుకున్న సందీప్‌ ఏపీ హైకోర్టు జస్టిస్‌ తన సోదరి అని, నగదు, వీసా కూడా ఇప్పిస్తానని ఆ మహిళను నమ్మించాడు. మగ గొంతు ఆడ గొంతుగా మారే యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నాడు. తొలుత సైబరాబాద్‌ సీపీకి ఫోన్‌ చేసి తాను ఏపీ హైకోర్టు జస్టిస్‌ను మాట్లాడుతున్నానని చెప్పడంతో సీపీ.. డీసీపీకి ఫోన్‌ చేయాలని సూచించారు. డీసీపీ నుంచి ఏసీపీ, సీఐ, ఎస్సైలకు వందలసార్లు ఫోన్‌ చేసేవాడు. జస్టిస్‌ చెప్తుంటే పట్టించుకోరా అంటూ మహిళకు న్యాయం చేయాలని ఆదేశించినట్లు మాట్లాడేవాడు. అదే మహిళ నుంచి భూవివాదం పరిష్కరిస్తానని రూ.50వేలు వసూలు చేశాడు. సందేహం వచ్చిన పోలీసులు సందీప్‌పై నిఘాపెట్టారు. ఎట్టకేలకు సూడో జస్టిస్‌గా అవతారమెత్తాడని గుర్తించి  బుధవారం అరెస్టు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని