logo

కిర్గిస్థాన్‌ నుంచి విద్యార్థులను సురక్షితంగా తీసుకురావాలి

కిర్గిస్థాన్‌లోని తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని జీవీకే ఎడ్యుటెక్‌ బృందం కోరింది.

Updated : 23 May 2024 04:55 IST

కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న విద్యకుమార్‌ 

కాచిగూడ, న్యూస్‌టుడే: కిర్గిస్థాన్‌లోని తెలుగు విద్యార్థులను సురక్షితంగా భారత్‌కు తీసుకువచ్చేలా తక్షణం చర్యలు చేపట్టాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని జీవీకే ఎడ్యుటెక్‌ బృందం కోరింది. స్థానికంగా ఘర్షణ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో.. విద్యార్థులకు ఎలాంటి హాని జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేసింది. బుధవారం విద్యకుమార్‌ నేతృత్వంలోని బృందం.. కిషన్‌రెడ్డిని కాచిగూడలోని నివాసంలో కలిసి వినతిపత్రం అందజేసింది. ఈ విషయమై కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో మాట్లాడని, విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్‌.జైశంకర్‌కు లేఖ కూడా రాసినట్లు కిషన్‌రెడ్డి వారికి తెలిపారు. ప్రస్తుతం అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. ఎవరూ అందోళన చెందాల్సిన అవసరంలేదన్నారు. సామాజిక మాధ్యమాల్లోని వదంతులను నమ్మొద్దని కోరారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని