logo

ఒంటరి వ్యక్తులే లక్ష్యంగా సెల్‌ఫోన్ల అపహరణ

ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఫోన్లను ఎత్తుకెళ్తున్న ముఠాలోని ఇద్దరు యువకులు, నలుగురు మైనర్లతో పాటు ఫోన్లను కొనుగోలు చేసిన ముగ్గురిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Published : 23 May 2024 04:31 IST

రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: ఒంటరి వ్యక్తులను లక్ష్యంగా చేసుకొని ఫోన్లను ఎత్తుకెళ్తున్న ముఠాలోని ఇద్దరు యువకులు, నలుగురు మైనర్లతో పాటు ఫోన్లను కొనుగోలు చేసిన ముగ్గురిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ ఎస్‌.రష్మీ పెరుమాళ్‌ వివరాల ప్రకారం... నేరేడుమెట్‌ వాసి రోహన్‌రాజ్‌(19), సికింద్రాబాద్‌ తిరుమలగిరి వాసి వి.డి.వివియన్‌ రాజ్‌(19)లు స్నేహితులు. జల్సాలకు అలవాటుపడిన వీరు తిరుమలగిరికి చెందిన నలుగురు మైనర్లను కలుపుకొని నగరంలోని పలు ప్రాంతాల్లో రాత్రిళ్లు, తెల్లవారు జామున బైక్‌లపై వెళ్తూ.. ఒంటరిగా నడుచుంటూ వెళ్తూ సెల్‌ఫోన్‌ మాట్లాడుతుండే వారిని లక్ష్యంగా చేసుకుంటారు. వారి చేతిలోని ఫోన్‌ లాక్కొని ఉడాయిస్తున్నారు. నేరేడుమెట్, తిరుమలగిరి ప్రాంతాల్లో బాధితుల నుంచి ఫిర్యాదులు రావడంతో పోలీసులు నిఘా పెట్టారు.  మంగళవారం ఉదయం నిందితులను సికింద్రాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. నిందితులతో పాటు ఫోన్లు కొనుగోలు చేసిన యువకులతో కలిపి 9మందిని రిమాండ్‌కు తరలించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని