logo

రైలు నుంచి దూకిన బాలిక..చికిత్స పొందుతూ మృతి

కదులుతున్న రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలిక మృతి చెందింది.

Published : 23 May 2024 04:32 IST

కాచిగూడ, న్యూస్‌టుడే: కదులుతున్న రైలు నుంచి దూకడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న బాలిక మృతి చెందింది. కాచిగూడ రైల్వే ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప, హెడ్‌కానిస్టేబుల్‌ సమ్మయ్య వివరాల ప్రకారం శనివారం కాచిగూడ స్టేషన్‌ నుంచి లింగంపల్లికి వెళుతూ ఎంఎంటీఎస్‌ రైలు ఎక్కే క్రమంలో ప్రమాదవశాత్తు రమేష్‌ కిందపడిపోయాడు. దీన్ని గుర్తించిన ఆయన కుమార్తెలు పూజ, విజయ(13)లు వెంటనే రైలు నుంచి ప్లాట్‌ఫాంపైకి దూకిన విషయం విదితమే. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలైన విజయను గాంధీ ఆసుపత్రికి తరలించారు. నాటి నుంచి అక్కడే చికిత్స పొందుతున్న ఆమె బుధవారం మృతి చెందింది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని