logo

ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్య

ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అభం శుభం ఎరగని ఆ చిన్నారి.. తన తల్లికి ఏమైందో తెలియక పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి ఆ ఇల్లాలు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది.

Published : 23 May 2024 04:42 IST

కుమార్తెతో ప్రీతి కుమారి 

దుండిగల్‌: ఏడాది వయసున్న కుమార్తె కళ్లెదుటే తల్లి ఆత్మహత్యకు పాల్పడింది. అభం శుభం ఎరగని ఆ చిన్నారి.. తన తల్లికి ఏమైందో తెలియక పాల కోసం గుక్క పెట్టి ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగువారు వచ్చి చూసేసరికి ఆ ఇల్లాలు ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్సై రాజేష్‌ వివరాల మేరకు.. బిహార్‌కు చెందిన రాహుల్, ప్రీతి కుమారి (24) దంపతులు నగరానికి వలస వచ్చి బహదూర్‌పల్లి గ్రీన్‌హిల్స్‌ కాలనీలో  ఉంటున్నారు.  వీరి కుమార్తె రితిక (1) ఉంది. రాహుల్‌ ఓ పరిశ్రమలో ఎలక్ట్రీషియన్‌. బుధవారం ఉదయం విధులకు వెళ్లాడు. 11:30 సమయంలో చిన్నారి గుక్క పట్టి ఏడుస్తుండటంతో ఇరుగుపొరుగువారు వెళ్లి తలుపులు తట్టారు. స్పందన లేకపోవడంతో బద్దలుగొట్టి చూడగా ఫ్యాన్‌కు ఉరేసుకున్న ప్రీతికుమారి కనిపించింది. దంపతుల మధ్య మనస్పర్థల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని